అందుకే ఆ హీరోలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదట..!
ప్రస్తుతం ప్రభాస్ పాపులారిటీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. అతను తీస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం కూడా తెలుగులో కాకుండా నేరుగా హిందీలోనే తెరకెక్కిస్తున్నారు ప్రభాస్. ఈ బాహుబలి స్టార్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని... అందుకే అతను తెలుగు ఇండస్ట్రీకి అంటి ముట్టనట్టు గా ఉంటున్నారని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇందులోని భాగంగానే చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపలేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాకపోతే ప్రభాస్ నేరుగా చిరంజీవి కి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ అందరూ ఫాలో అయ్యే ట్రెండ్ ని అస్సలు ఫాలో అవ్వరు. అందుకే సోషల్ మీడియా సముద్రంలో చిరంజీవికి అంది అందని శుభాకాంక్షలు తెలిపిన చేతులు దులుపుకోవడం ఇష్టంలేక చిరంజీవికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని సమాచారం.