కొరటాలా.. మజాకా : ఆచార్య మోషన్ పోస్టర్.. అంచనాలు విపరీతంగా పెంచేసిందిగా..?

Chakravarthi Kalyan
సినిమా ఓ పవర్ ఫుల్ మీడియం.. సామాన్య జనాలకు సైతం సులభంగా ఏ సందేశం ఇచ్చినా చేరిపోతుంది. అదే సమయంలో సినిమా ఓ ఫక్తు వ్యాపారం.. సినిమా రూపొందడంలో ఏమాత్రం తేడా వచ్చినా అది వందల కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.  ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయగలగడం ఓ సాహసం అనే చెప్పాలి. నిజంగా అలాంటి సాహసం చేసి విజయం సాధిస్తే.. అంత కంటే గొప్ప విషయం ఉండదు.

కానీ.. దర్శకుడు కొరటాల శివ.. ఈ ఫీట్‌ను చాలా అలవోకగా చేస్తుంటారు. ఆయన చేసిన సినిమాలు కొన్నే అయినా దాదాపు అన్నింటిలోనూ ఓ సందేశం అంటూ ఉంటుంది. అలాగే ప్రతి సినిమా కమర్షియల్ గా సూపర్ గా సక్సస్ అయ్యాయి. మిర్చి, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. ఇలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న దర్శకుడు చిరంజీవి వంటి వీర మాస్ స్టార్‌ తో జతకడితే ఇంకెలా ఉంటుంది.. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమాపై విపరీతంగా అంచనాలు ఉన్నాయి.

చిరంజీవి కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక తన సినిమాలు సందేశాత్మకంగా ఉంటూనే జనరంజకంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఇవాళ రిలీజ్‌ అయిన ఆచార్య మోషన్ పోస్టర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో జనతా గ్యారేజ్ తరహాలోనే ఈసారి ధర్మస్థలి అనే బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు.

సో.. సినిమాలో ఈ ధర్మస్థలికి ఏదో బ్యాక్‌ డ్రాప్ ఉన్నట్టే ఉంది. అలాగే జనం మధ్యలో కత్తి పట్టుకున్న మెగాస్టార్ లుక్ సినిమా కథను సింబాలిక్‌గా చెప్పేస్తోంది. మొత్తానికి ఈ  లుక్ చాలా గంభీరంగా ఉంది. తాము అనుకున్న స్థాయిలో వచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ మూవీ మోషన్ పిక్చర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: