అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్

Reddy P Rajasekhar

తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘ మండాడి ’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బోట్ రేసింగ్, యాక్షన్, ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘మండాడి’ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా శివ నిర్వాణ స్పెషల్ గెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా *హీరో సుహాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడి దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు టీచర్స్ డే, నా టీచర్స్ అంతా నా ముందే ఉన్నారు. మీ అందరి సపోర్ట్ తో ఎన్నో ఫేజెస్ దాటుకుంటూ మందాడి వరకు వచ్చా. చిత్రయూనిట్ అందరి సపోర్ట్ వల్లనే సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాము. హీరోయిన్ మహిమ, రవీంద్ర విజయ్, సూరి నటన ఈ సినిమాకు మెయిన్ అసెట్స్. సెప్టెంబర్ 10 న ఓ వినూత్న కంటెంట్ థియేటర్స్ లో చూడటానికి సిద్ధంగా ఉండండి అన్నారు.

యాక్టర్ సూరి మాట్లాడుతూ.. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈ సారికి వదిలేయండి, వచ్చే సారి ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతా. మండాడి సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సుహాస్ తో కాళీ పని చేయడం చాలా సంతోషంగా అంది అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నాకు పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గారికి స్పెషల్ థాంక్స్. ఏష నాగుల గట్ట మీద సాంగ్ బిగ్గెస్ట్ హిట్ చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

 యాక్టర్ రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఒక సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరం చాలా కష్ట పడ్డాము. ఇలాంటి ఒక కథ ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవం. ఇప్పటివరకు చూడని ఎన్నో సీన్స్ ఈ ఇంటెన్స్ స్పోర్ట్ యాక్షన్ డ్రామా చూసి ఉండరు. సముద్రంలో ఎంతో చాలెంజింగ్ గా ఈ సినిమా షూట్ చేశారు. ఈ సినిమా కోసం సూరి, సుహాస్ ఎంతో నిబద్దతతో పని చేశారు. ఇది ఎమోషనల్ ప్యాక్ యాక్షన్ డ్రామా. ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా ఇది అన్నారు.

 హీరోయిన్ మహిమా నంబియార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మందాడి నాకు చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా యూనిట్ మొత్తానికి స్పెషల్ థాంక్స్. హీరో సుహాస్ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. రవీంద్ర విజయ్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సూరి సార్ మీరు నాకు ఇన్స్పిరేషన్. ఈ సినిమా చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా అన్నారు.

 డైరెక్టర్ మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాతలకు, నటీనటులకు అందరికీ థాంక్స్. సూరి, సుహాస్ లేకుండా అస్సలు ఈ సినిమానే లేదు. ఈ బోట్ రేస్ అనేది తమిళనాడు లో ట్రెండ్. ఈ సినిమా కోసం ఎంతో కంమిట్మెంట్ తో పని చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రూపొందించాం. ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పంచుతుందని నమ్ముతున్నా అన్నారు.

 ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రొడ్యూసర్ ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మైత్రి నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. ఒకరోజు నవీన్ సార్ స్వయంగా కాల్ చేసి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్న చేస్తా అన్నారు. ఈ సినిమా కోసం చాలా డబ్బు వెచ్చించాము. మా సినిమా ఓటీటీ డీల్ లో నవీన్ గారి సహకారం గొప్పది అన్నారు. హీరో హీరోయిన్లతో పాటు నటీనటులు అంతా బాగా కష్టపడి ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారు అని తెలిపారు.

 మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ.. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నా. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు.    

హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ఒక మూవీ పేరు వినగానే సినిమాకు వెళ్ళాలి అనిపించే సినిమా ఇది. సూరి, సుహాస్ నడుమ ఓ బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేశారు. సముద్రంలో సినిమా తీయడం అనేది పెద్ద ఛాలెంజ్. పడవ షాట్ తీయడంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాంటిది సినిమా మొత్తం సముద్రంలో తీశారంటే రియల్లీ హ్యాట్సాఫ్ అన్నారు. మరో అతిధి,

 డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం చాలా గర్వంగా ఉంది. సూరి గారు మీరు డౌన్ టు ఎర్త్. ఈ సినిమా తరిలేరు చూసి ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుండనై ఫిక్స్ అయ్యా. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారు. థియేటర్స్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మందాడి సినిమాకు ఎన్నో అవార్డ్స్ వస్తాయని నమ్మతున్నా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: