కేజీఎప్ 2 సినిమాకు లైన్ క్లియర్.. సంజయ్ దత్ పరిస్థితి ఏంటంటే..!

NAGARJUNA NAKKA
లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లే ముందు ముంబైలోని ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారు సంజయ్‌. మరోవైపు సంజయ్‌ నటిస్తున్న కేజీఎఫ్‌-2 సినిమా షూటింగ్‌కు లైన్‌క్లియర్‌ అయింది.
బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ఆగ‌స్ట్ 8న క‌రోనా పరీక్ష‌ల కోసం అని లీలావ‌తి ఆసుప‌త్రికి వెళ్ల‌ారు. పరీక్షల్లో అక్క‌డ‌ ఆయ‌న లంగ్‌ క్యాన్స‌ర్ బారిన పడ్డ‌ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ప్ర‌స్తుతం సంజ‌య్ స్టేజ్‌-4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
లంగ్ క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స కోసం త్వరలో అమెరికా వెళ్లునున్నారు సంజయ్. ఇటీవలే లీలావతి ఆస్పత్రి నుంచి సంజయ్‌ డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి వరకు ముంబైలోని ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆస్పత్రికి వెళ్లే ముందు సంజయ్‌ దత్ ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ కారు ఎక్కారు. ఎవరూ తన ఆరోగ్య విషయంలో ఆందోళన చెందవద్దని.. త్వరలోనే కోలుకొని వస్తానని అభిమానులకు తెలిపారు సంజయ్‌.
మరోవైపు కేజీఎప్ 2 సినిమా షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్నారు. జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి.. షూటింగ్ లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందంటూ.. ఓ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శిక్ష పడిన వ్యక్తి సినిమాల్లో నటించకూడదని చట్టంలో లేదని, అందువల్ల దీన్ని కొట్టి వేస్తున్నామని ప్రకటించారు.  కలెక్షన్ ల రికార్డులు తిరగరాసిన కేజీఎఫ్ కు స్వీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ " అధీరా" రోల్ పోషిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చిందని ఎపుడు తెలిసిందో అప్పటి నుంచే.. సంజయ్ త్వరగా కోలుకోవాలని తమ ఇష్టదైవాలను వేడుకుంటున్నారు. కేజీఎఫ్ 2లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. తమ అభిమాన హీరో తిరిగి సాధారణ స్థితికి వచ్చి తమను అలరిస్తారని ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: