ప్రముఖ నిర్మాతని మెప్పించిన కలర్ ఫోటో..!

shami
సందీప్ రాజ్ డైరక్షన్ లో సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కించిన సినిమా కలర్ ఫోటో. చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్ తో తన టాలెంట్ చూపుతూ వచ్చిన సుహాస్ ఆ తర్వాత కమెడియన్ గా వరుస ఆఫర్లు అందుకున్నాడు. ఇప్పుడు అతను హీరోగా సినిమా రాబోతుంది. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే కమెడియన్ కం హీరో సునీల్ విలన్ గా చేస్తుండటమే..కమెడియన్ గా పీక్స్ లో కెరియర్ ఉన్నప్పుడు హీరోగా మారిన సునీల్ ఆ తర్వాత మళ్ళీ కమెడియన్ గా ఛాన్సుల కోసం వెతుకుతున్నాడు.

అటు కమెడియన్ గా చేస్తూనే విలన్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. సునీల్ ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో నటించిన కలర్ ఫోటో అవుట్ పుట్ బాగా వచ్చిందని టాక్. అందుకే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కన్ను పడ్డది. గీతా ఆర్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా సమర్పణ చేస్తారని తెలుస్తుంది. ఈ మేరకు నిర్మాతలతో డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

థియేటర్ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కాని కలర్ ఫోటో ఆహాలో మాత్రం వస్తుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ కొనేసింది కాబట్టి ఆహాలోనే కలర్ ఫోటో డైరెక్ట్ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. సుహాస్ చేసిన మొదటి సినిమా థియేటర్ లో రిలీజ్ కావట్లేదు అనే చిన్న అసంతృప్తి తప్ప గీతా ఆర్ట్స్ బ్యానర్ ను మెప్పించడం అనేది తెలికైన విషయం కాదు. ఈ సినిమా తర్వాత సుహాస మళ్ళీ కమెడియన్ గా కొనసాగుతాడని తెలుస్తుంది. కమెడియన్ గా చేస్తూనే తనకు అవకాశం వచ్చిన సినిమా చేస్తాడని అంటున్నారు. చాందిని కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది.               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: