మెగా హీరోలతో క్రేజీ డైరెక్టర్ వరుస సినిమాలు.. !

NAGARJUNA NAKKA
క్రిష్ మెగా డైరెక్టర్ గా మారిపోతున్నాడు. వరుసగా మెగా హీరోలతో సినిమాలు తీస్తూ కొణిదెల కాంపౌండ్ కి మరింత దగ్గరవుతున్నాడు. మొదట అబ్బాయితో సినిమా తీసిన క్రిష్, ఇప్పుడు బాబాయిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ సెట్స్ లో ఉండగానే, మేనళ్లుడి సినిమా మొదలుపెట్టాడు క్రిష్.  

క్రిష్ మెగాఫ్యామిలీ హీరోలందరినీ కవర్ చేస్తున్నాడు. స్టార్ హీరోలు, కుర్రాళ్లు అనే తేడా లేకుండా అందరితో సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటికే మెగాఫ్యామిలీలో ఇద్దరు హీరోలతో సినిమాలు తీసిన క్రిష్, ఇప్పుడు మూడో ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీని క్రిష్ హోం బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.

క్రిష్ ఇంతకుముందు వరుణ్ తేజ్ తో ‘కంచె’సినిమా తీశాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో కాస్టిజాన్ని టచ్ చేస్తూ క్రిష్ తీసిన ఈ ప్రేమకథకి బోల్డన్ని ప్రశంషలు వచ్చాయి. ఇక ఈ మూవీ తర్వాత చాన్నాళ్లకి కొణిదెల కాంపౌండ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా తీస్తున్నాడు క్రిష్. ఔరంగజేబు కాలంనాటి కథాంశంతో పీరియాడికల్ డ్రామాగా వస్తోందీ సినిమా.

పవన్ కళ్యాణ్-క్రిష్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ లాక్ డౌన్ లోకి వెళ్లింది. అయితే కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకు నో షూటింగ్స్ అంటున్నాడు పవన్. సో పవర్ స్టార్ వచ్చే ఏడాది వరకు షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశంలేదని ఫిక్స్ అయ్యారట దర్శకనిర్మాతలు. అందుకే ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేశాడట క్రిష్. ఇక ఈ మూవీలో వైష్ణవ్ తో రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కడుతోంది. లాంగ్ షెడ్యూల్స్ తో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి, వచ్చే ఏడాదికి పవన్ సినిమాని రీస్టార్ట్ చేస్తాడట క్రిష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: