మన టాలీవుడ్ స్టార్ హీరోలు మొదటి 100 కోట్లు సాధించిన సినిమాలు..

Purushottham Vinay
మన స్టార్ హీరోలు మొట్టమొదటి సారిగా 100 కోట్లు యే సినిమాలు ద్వారా అందుకున్నారో ఇండియా హెరాల్డ్. కామ్ అందిస్తున్న ఈ న్యూస్ మీకోసం.
అప్పట్లో మన హీరోల సినిమాలు 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు ఇలా ఎక్కువ రోజులు ఆడితే ఆ సినిమాలని సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ లు గా పరిగణిస్తారు. ఎందుకంటే అప్పట్లో కలెక్షన్ల కంటే ఇలా రన్నింగ్ డేస్ కి వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇక ఫస్ట్ టైమ్ పోకిరి సినిమా ఈ కలెక్షన్ల ట్రెండు స్టార్ట్ చేసింది.ఇక అక్కడి నుంచి కలెక్షన్ల హడావుడి మొదలైంది.
ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 100 కోట్లు సాధించిన ఘనత పొందింది. 2011 లో వచ్చిన దూకుడు సినిమా అన్ని లొకేషన్స్ లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 105 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 100 కోట్లు కొల్లగొట్టిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.
తర్వాత ఈ ఫీట్ ని రామ్ చరణ్ సాధించాడు. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు పైగానే  గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నిజానికి దూకుడు కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కాని దూకుడు తర్వాత ఈ సినిమాని ఓవర్ సీస్ లో రిలీజ్ చేశారు. ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్యాక అప్పుడు 100 కోట్లు  కలెక్ట్ చేసింది ఈ మూవీ.
తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ప్రభాస్, రానా బాహుబలి సినిమాతోను తర్వాత అల్లు అర్జున్ సరైనోడు సినిమాతోనూ, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తోను, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తోను, నాగార్జున ఊపిరి సినిమాతోనూ,విజయ్ దేవరకొండ గీతా గోవిందంతోను  వెంకటేష్, వరున్ తేజ్  f2 సినిమాతోనూ ఈ ఘనత సాధించారు. ఈ సినిమాలన్నీ కూడ వీళ్ళకి మొట్టమొదటి సారి 100 కోట్లు వసూళ్లు తెచ్చిన సినిమాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: