సమంత సొగసరి అందాలకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..!

Suma Kallamadi
సమంత అక్కినేని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటూ తన అందమైన జీవితానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. లాక్ డౌన్ సమయంలో దాదాపు మూడు లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన సమంత అక్కినేని సోషల్ మీడియా స్టార్ గా దూసుకెళ్తున్నారు. క్వారంటైన్ లో చిన్నపాటి రైతు గా మారిన సమంత అక్కినేని ఆ తరువాత ఈశా క్రియ యోగ ప్రక్రియను మొదలు పెట్టిన తన ఆరోగ్యాన్ని విపరీతంగా పెంచేసుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత సుదీర్ఘ విశ్రాంతి దొరికిన సమంత తన మనసుకు శరీరానికి బాగా ప్రశాంతత కల్పిస్తూ రోజురోజుకీ చాలా అందంగా తయారవుతారని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


గత రెండు రోజులుగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తన సరికొత్త ఫోటోలు షేర్ చేస్తున్నారు. దగ్గుపాటి రానా వేడుకలకు హాజరైన సమంత చేనేత వస్త్రాలను ధరించి ఫోటో షూట్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. మెడలో తెల్లని హారం ధరించి.. పసుపు పచ్చ చేనేత వస్త్రాలలో చక్కని చుక్కలా కనిపిస్తున్న సమంత అక్కినేని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈరోజు తను ఇంకొక ఫోటో షూట్ కి సంబంధించిన చిత్రాలను కూడా ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.


ఈ ఫోటో షూట్ లో కూడా సమంత అక్కినేని సొగసరి అందానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తాజా ఫోటో షూట్ లో  బంగారపు నగలను ధరించి బ్లూ కలర్ చేనేత చీరలో అందాల సుందరి మణి గా కనిపిస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్నారు సమంత. కొద్దిపాటి మేకప్ తో ఎంతో రమణీయంగా కనిపిస్తున్న చందమామ లాంటి ఆమె మొహము కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఏదేమైనా సమంత చెక్కుచెదరని అందాలను చూస్తూ ఉంటే ఆమె 2030 వరకు హీరోయిన్ గానే నటిస్తుందేమో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: