రానా పెళ్ళి పై అక్షయ్ కుమార్ సెటైర్లు !

Seetha Sailaja
రానా పెళ్ళి గుజరాతి తెలుగు సాంప్రదాయాల మేళవింపుతో చాల సాంప్రదాయ బద్ధంగా జరిగింది. అతి తక్కువ అతిధుల మధ్య ఈ పెళ్ళి జరిగినప్పటికీ ఈ పెళ్ళి వేడుకలలోని ప్రతిఘట్టంలోను సంప్రాదాయాన్ని పాటించారు. అగ్నిహోత్రం చుట్టూ గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ముందు మిహీకా బజాజ్ నడుస్తూ ఉండగా ఆమెను అనుసరిస్తూ రానా అడుగులు వేసాడు. గుజరాతి తెలుగు సాంప్రదాయాల వంటలతో అతిధులకు వింధుభోజనాలు చేసారు.

నిన్న జరిగిన ఈ పెళ్లి వేడుకలను సెలెబ్రెటీలు చాలామంది వ‌ర్చువ‌ల్ రియాలిటీ ద్వారా చూసారు. దీనికోసం రానా చాలామందికి వీఆర్ సెట్లు కూడా పంపించాడు. ఈ పెళ్లిని చూస్తూ అనేకమంది సెలెబ్రెటీలు రకరకాల జోక్స్ కూడ వేసారు. ఐకానిక్ బ్యాచిల‌ర్ ముగింపును చూస్తున్నాను అంటూ వీఆర్‌లో రానా పెళ్లిని చూస్తున్న ఫొటోను నాని షేర్ చేస్తే మరొక వైపు న‌వ‌దీప్ రానా పెళ్లి పై స్పందిస్తూ క‌నీవినీ ఎరుగ‌ని రోజుకు శుభాకాంక్ష‌లు మిత్ర‌మా అంటూ జోక్ చేసాడు.

ఇది చాలదు అన్నట్లుగా బాలీవుడ్ టాప్ హీరో రానా పెళ్ళి పై స్పందిస్తూ జీవితంలో శాశ్వ‌తంగా లాక్ డౌన్ కావ‌డానికి రానా కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ కామెంట్స్ చేసాడు. ఈ పెళ్ళి వేడుకలలో రానా మిహీక ల తరువాత అందర్నీ ఆకర్షించింది సమంత మాత్రమే.

రానా ప్రీ వెడ్డింగ్ వేడుకలో అదేవిధంగా రానా పెళ్ళి వేడుకలలో సమంత వేసుకున్న డ్రెస్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో  చమ్కీలు అద్దాలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కలర్ మిక్సింగ్ లతో అద్భుతంగా డిజైన్ చేయబడ్డ ఈ డ్రెస్ లక్షల రూపాయలలో ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖ సెలెబ్రెటీలకు సంబంధించిన బ్రహ్మచారుల లిస్టులో రానా పెళ్ళి కూడ అయిపోవడంతో ఇక ప్రభాస్ తప్ప మరెవ్వరు లిస్టులో లేరు. దీనితో కొంతమంది ప్రియమిత్రుడు ప్రభాస్ ను వదిలి రానా అన్యాయం చేసాడు అంటూ జోక్స్ కూడ వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: