మళ్ళీ రాబోతున్న ఏ వి ఎమ్ ప్రొడక్షన్స్ !

Purushottham Vinay

ఎవిఎం ప్రొడక్షన్స్ ఎ. వి. మీయప్పన్ స్థాపించిన భారతీయ చలన చిత్ర నిర్మాణ స్టూడియో. ఇది భారతదేశంలో మిగిలి ఉన్న చివరి పురాతన స్టూడియో. చిత్రీకరణ స్టూడియోలు చెన్నైలోని వడపాలనిలో ఉన్నాయి. ఇది తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లో 300 కి పైగా చిత్రాలను నిర్మించింది. ఎ.వి.ఎం దక్షిణాది పరిశ్రమలలో అనేక మంది నటులను పరిచయం చేసింది, కొంతమంది ప్రముఖ నటులు శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, యస్.యస్.రాజేంద్రన్, వైజయంతిమల, కమల్ హాసన్ మరియు మరెన్నో. ఎ.వి.ఎం  స్టూడియోలో షూటింగ్ అంతస్తులతో పాటు, రికార్డింగ్, డబ్బింగ్ మరియు ప్రివ్యూ థియేటర్ ఉన్నాయి. ఈ సముదాయంలో ఉత్పత్తి మరియు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ కోసం సౌకర్యాలు ఉన్నాయి.

అప్పుడు ఏ సినిమా చూసిన ఈ ప్రొడక్షన్ లోనే నిర్మించబడేవి. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి కలర్ సినిమాలు దాకా ఎన్నో సినిమాలని నిర్మించింది ఈ సినిమా. ఇది ఒక లెజెండరీ ప్రొడక్షన్ సంస్థ. ఎన్ని ప్రొడక్షన్ కంపెనీస్, బ్యానర్స్ వచ్చిన దీని ముందు చిన్నవే. ఎన్నో సినిమాలని నిర్మించిన ఏకైక ప్రొడక్షన్ కంపెనీ ఇది. తర్వాత కొన్ని కారణాల వలన ఈ సంస్థ సినిమాలు నిర్మించడం మానేసింది. తర్వాత కొత్త ప్రొడక్షన్ కంపెనీస్ వచ్చాయి. కాలక్రమేనా ఈ సంస్థ సినిమాలను తీయడం ఆపేసింది.

ఈ సంస్థ లో వచ్చిన ఎన్నో సినిమాలు చాలా అవార్డు లు అందుకున్నాయి. కొన్ని సినిమా లు జాతీయ స్థాయిలో ప్రదర్షింపబడి, జాతీయ అవార్డులు కూడా అందుకున్నాయి. 2007 లో, ఎ.వి.ఎం  సంస్థ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమా ని నిర్మించింది. దాదాపు 95 కోట్ల ఖర్చు తో నిర్మించింది , ఆ సమయంలో భారత చిత్ర పరిశ్రమ చరిత్రలో అప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన చిత్రం ఇదే. తర్వాత సీరియల్స్ నిర్మించడం మొదలు పెట్టింది ఈ నిర్మాణ సంస్థ.

 
ఇక పోతే ఈ ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ మ్యానెర్ లో తిరిగి రానుంది. ఏ వి ఎమ్ ప్రొడక్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ భాష ల లో వెబ్ సిరీస్ ని నిర్మించి ఓ టీ టీ ప్లాటుఫారంస్ లో విడుదల చేయనుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: