అనిల్ రావిపూడి తర్వాతి ప్లాన్ ఏంటో తెలుసా.. ?
అనిల్ రావిపూడి చాలా క్లారిటీగా ఉంటాడని అతనితో పనిచేసిన హీరోలు నిర్మాతలు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడమే ఎజెండాగా స్క్రిప్ట్ లు రెడీ చేస్తాడని చెబుతుంటారు. అందుకే మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడని చెబుతారు. అయితే ఇంత పాజిటివ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ మేకర్, తర్వాతి ప్రాజెక్ట్ పై చాలా కన్ ఫ్యూజన్ లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. తర్వాతి మూవీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్ 3 తీయాలనుకున్నాడు. కరోనా లాక్ డౌన్ లోనే ఈ సీక్వెల్ కు స్క్రిప్ట్ కు కూడా కంప్లీట్ చేశాడు. అయితే ఎఫ్ 2 స్టార్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇద్దరు వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. పైగా కరోనా లాక్ డౌన్ తో ఈ హీరోల షెడ్యూల్స్ అన్ని మారిపోయాయి. దీంతో ఈ హీరోలు ఫ్రీ అయ్యేలోపు ఒక వెబ్ సిరీస్ తీద్దాం అనుకున్నాడట అనిల్. కానీ ఈ మేకర్ ఇప్పుడీ ఆలోచనను కూడా పక్కనపెట్టేశాడనే టాక్ వస్తోంది.
అనిల్ రావిపూడి రీసెంట్ గా బాలకృష్ణకు ఓ స్టోరీ నెరేట్ చేశాడట. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని సమాచారం. అయితే నాలుగేళ్ల క్రితమే అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో రామారావుగారు అనే సినిమా వస్తోందనే ప్రచారం జరిగింది.. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లలేదు. మళ్లీ ఇప్పుడీ కాంబోలో సినిమా రాబోతోంది టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ తర్వాత బి.గోపాల్ తో సినిమా చేస్తాడనే టాక్ వస్తోంది. మరి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అనిల్ వెయిట్ చేస్తాడా.. లేక మరో హీరో దగ్గరకు వెళ్తాడా అనేది చూడాలి.