రంగ్ దే టీజర్ కు మంచి ఆదరణ.. !

NAGARJUNA NAKKA

పెళ్లి చేసుకుంటే రంగు పడుద్దని నితిన్ ని పెళ్లి టీజర్ తో విష్ చేసింది రంగ్ దే టీమ్. నితిన్ పెళ్లి సందర్భంగా ఆదివారం రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక రిలీజ్ డేట్ లో ఉన్న క్రియేటివిటీకి కూడా నెటిజన్స్ నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. 

 

నితిన్ జులై 26న ఒక ఇంటి వాడయ్యాడు. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ షాలినీతో కలిసి ఏడడుగులు వేశాడు. ఇక కోవిడ్-19 నిబంధనలు అనుసరిస్తూ.. లిమిటెడ్ గెస్ట్స్ తో జరుపుకుంటున్న ఈ పెళ్లికి రంగ్ దే టీమ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతూనే.. పెళ్లిలో ఉండే ఇంటిపని, వంటపని గురించి  హెచ్చరించింది రంగ్ దే టీమ్. 

 

నితిన్ రంగ్ దే టీజర్ చూస్తే.. ఈ సిిినిమా ఫుల్ లెంగ్త్ కామెండీ ఎంటర్ టైనర్ గా వస్తుందనే చెప్పొచ్చు. పెళ్లి అంటే భయపడే కుర్రాడికి.. పెళ్లి తర్వాత రంగుల ప్రపంచం కనిపించిందా.. లేక రంగులు కనపడ్డాయా అనేది ఈ మూవీ లైన్ గా కనిపిస్తోంది. ఇక నితిన్ పెళ్లికి ముందు నటించిన భీష్మ సినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గానే వచ్చింది. 

 

రంగ్ దే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ డేట్ కీ కామెడీ టచ్ ఇచ్చారు మేకర్స్. సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం అని ఎనౌన్స్ చేశారు. అంటే కరోనా ప్రభావం తగ్గితే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి.. సంక్రాంతికల్లా థియేటర్స్ ఓపెన్ అయితే సినిమా రిలీజ్ చేస్తాం అన్నట్టు రిలీజ్ డేట్ ఎనౌనస్ చేశారు మేకర్స్. 

 

మొత్తానికి రంగ్ దే మూవీ తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలను రేకెత్తిస్తోంది. మరి చూడాలి నిజంగా ఆ సినిమా నితిన్ అభిమానులను రంగుల మయం చేస్తుందో లేదో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: