అదిరిపోయిన ఫస్ట్ లుక్కు.. ఆ టైటిల్ కూడా పర్ఫెక్టు..!

shami

యువ హీరోల్లో నాగ శౌర్య ప్రతిభ గురించి తెలిసిందే. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే నాగ శౌర్య మల్టీస్టారర్ సినిమాలకు కూడా సై అంటున్నాడు. వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కొందరు హీరోలు ఇష్టపడరు కాని స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేస్తాడు నాగ శౌర్య. ఇక కొన్ని  సినిమాలకు కథలు తనే రాసుకునే ఈ హీరో ఛలో తర్వాత హిట్ సినిమాకు దూరమయ్యాడు.

 

ఈ ఇయర్ మొదట్లో అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం నాగ శౌర్య చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా రిలీజైంది. కండలు తిరిగే దేహంతో బాణం ఎక్కుపెట్టి మరి షాక్ ఇచ్చాడు నాగ శౌర్య. ఈ సినిమాకు టైటిల్ గా పార్ధు అనేది పరిశీలనలో ఉందని తెలుస్తుంది. దాదాపుగా ఇదే టైటిల్ కన్ఫాం అంటున్నారు. అయితే చిత్రయూనిట్ ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ చేయలేదు. దాదాపు ఇదే టైటిల్ పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.       

 

నారాయణ్ దాస్, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు. నాగ శౌర్య ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. పర్ఫెక్ట్ మాస్ సినిమాగా అనిపిస్తున్న ఈ మూవీకి పార్ధు టైటిల్ కూదా బాగుంటుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 60 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్నా విజయ్ దేవరకొండ తరహాలో మాస్ హిట్ కొడితేనే యూత్ లో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే నాగ శౌర్య వరుస మాస్ మూవీస్ చేస్తున్నాడు. అశ్వద్ధామతో టార్గెట్ మిస్ అయ్యింది మరి ఈ పార్థు అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: