మూడు ముళ్ల బంధంతో ఒకటైన నితిన్, షాలిని.. పెళ్లి ఫొటోలు ఇవే!!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మొత్తానికి మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. ఇన్నాళ్ల బ్రహ్యచర్యానికి స్వస్తి పలుకుతూ.. ప్రేయసి కందుకూరి షాలిని మెడలో మూడు మూళ్లు వేశాడు.
వీరి పెళ్లి వేడుక తాజ్ ఫలక్ నుమా హోటల్ లో నిన్న రాత్రి వైభవంగా జరిగింది. పెళ్లికొడుకుగా నితిన్, పెళ్లికూతురిగా షాలిని డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు.
అయితే కరోనా నేపథ్యంలో కేవలం కొద్ది మంది సన్నిహితలు సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది. ఇక నితిన్, షాలిని పెళ్లి వేడుకకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
కాగా, నిలిన్, షాలినిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా ప్రభావంతో పెళ్లిని వాయిదా వేశారు. అయితే ఇప్పట్లో కరోనా సమస్య ముగిసే సూచనలు లేకపోవడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు నితిన్, షాలినిల పెళ్లిని నిన్న రాత్రి జరిపించారు.