వారెవా..! మహేశ్ బాబు ఆల్‌ ఇండియా రికార్డ్..! : పండూ గాడి దెబ్బకు దిమ్మ తిరిగిందిగా..!

Chakravarthi Kalyan

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పాడు.. త్వరలో ఆయన జన్మదినం ఉన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కోసం మహేశ్ బాబు బర్త్ డే సీడీపీని ట్విట్టర్‌లో  శనివారం అందుబాటులో ఉంచారు. ఈ కామన్ డీపీ ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా రికార్డు కొట్టేసి మహేశ్ బాబు స్టామినా ఏంటో చూపించేసింది. 

 

 


24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్లతో ఈ మహేశ్ బాబు కామన్ డీపీ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రెండ్ ను క్రియేట్ చేసేసింది. మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్స్ బలం, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కు నిదర్శంగా ఈ రికార్డును చెప్పుకోవచ్చు.  ఈ విషయాన్ని  సినీదర్శకుడు బీఏ రాజు తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. 

 


ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే.. కామన్ డీపీ అందుబాటులోకి తీసుకురావడం ఓ ట్రెండ్ గా మారింది. తమ అభిమాన నటుడి ఫోటోను డీపీగా పెట్టుకోవడం ఫ్యాన్స్ కు  కూడా ఓ క్రేజ్ గా మారిపోయింది. 

 


ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత బాలయ్యల పుట్టిన రోజుకు ముందు కూడా ఈ కామన్ డీపీ సందడి కొనసాగింది. అలా తమ అభిమాన నటుల డీపీలను పెట్టుకోవడం ఫ్యాన్స్ కు అదో సరదా మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: