జబర్దస్త్ గడ్డం నవీన్ అంత చిన్నవాడా.. మరేంటి ముసలోడిలా ఉంటాడు..?

frame జబర్దస్త్ గడ్డం నవీన్ అంత చిన్నవాడా.. మరేంటి ముసలోడిలా ఉంటాడు..?

praveen
కొంతమంది రూపురేఖలకు వయసుకు అస్సలు సంబంధం ఉండదు... చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించిన  ముసలి వాళ్ళ లాగా కనిపిస్తూ ఉంటారు . ఇక్కడ ఓ  జబర్దస్త్ నటుడు విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. అతను జబర్దస్త్ లో మంచి కమెడియన్... తనదైన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు... సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నాడు... చూడటానికి రిటైర్మెంట్ ప్రకటించిన ముసలాడిలా కనిపిస్తాడు. అతన్ని  ఎవరు చూసినా అదే అనుకుంటారు... కానీ అసలు నిజం ఏమిటి అంటే.. ఇతనికి పట్టుమని 50 ఏళ్ళు  కూడా లేవట . ఇంతకీ ఆ కమెడియన్  ఎవరు అనుకుంటున్నారా... జబర్దస్త్ లో అభి టీం లో కామెడీ చేస్తూ  ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న నవీన్. గడ్డం నవీన్ అంటే అందరు గుర్తుపడతారేమో.. అదిరే అభి స్కిట్ లో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన గడ్డం నవీన్ ఆ తర్వాత తన దైన కామెడీ టైమింగ్ తో  ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్నాడు.



 అంతే కాదు గడ్డం నవీన్ కి జూనియర్ రాఘవేంద్ర రావు అని ఒక మంచి గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమా  అవకాశాలు కూడా అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్. ఇక అతని వయసు విషయానికొస్తే.. తెల్ల గడ్డం బట్టతల చూసిన తర్వాత... అతని వయసు 60 దాటిపోయి ఉంటుంది అని అనుకుంటారు అందరూ. 60 ఏళ్ల వయసులో జబర్దస్త్ లో ఫేమస్ అయ్యాడు అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం పొరపాటే . మీరు ఊహించినట్లుగా జబర్దస్త్ గడ్డం నవీన్ వయస్సు 60 సంవత్సరాలు ఉండదు... అతని వయస్సు 45 సంవత్సరాలు కూడా ఉండదు... ఇంతకీ ఎంత  అనుకుంటున్నారా.. ఈ సంవత్సరంలో  నవీన్ వయసు కేవలం 43 ఏళ్లకు చేరిందట .



ఏంటి ఆశ్చర్య పోయారు కదా.. ఈ విషయాన్ని నవీన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో పూర్తిగా జుట్టుతో మంచి హెయిర్ స్టైల్ తో  హీరోల ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని కానీ ఇప్పుడు మాత్రం జుట్టు ఊడిపోయిన  తర్వాత అందరూ పట్టించుకుంటున్నారు అంటూ ఒక నవ్వు నవ్వేసాడు గడ్డం నవీన్.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: