ఎన్టీఆర్ కెరీర్ నే కాదు .... ఫిజిక్ ని కూడా మార్చింది ఆయనే ......??

GVK Writings

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణం సినిమాతో చిన్నతనంలోనే నటుడిగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత నిన్ను చూడాలని మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా పెద్ద హిట్ సాధించి, నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. అనంతరం వచ్చిన ఆది, సింహాద్రి సినిమాలు ఎన్టీఆర్ కు భారీ సక్సెస్ లు అందించి అద్భుతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిపెట్టాయి. కొన్నాళ్ల తరువాత వచ్చిన యమదొంగ మూవీ అతి పెద్ద విజయం కూడా ఎన్టీఆర్ కెరీర్ కి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. ఆ విధంగా ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద విజయాలైన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలు తీసింది మన టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి కావడం విశేషం. 

వాస్తవానికి ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ, దర్శకుడిగా రాజమౌళికి డైరెక్టర్ గా డెబ్యూ మూవీ. అలా ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకున్న రాజమౌళి, ఆ తరువాత కూడా ఎన్టీఆర్ కు మరొక రెండు బ్లాక్ బస్టర్లు అందించి ఆయన కెరీర్ లో బెస్ట్ సక్సెస్ లు ఇచ్చిన దర్శకుడిగా నిలిచారు. అయితే మొదటి నుండి ఎన్టీఆర్ తో పర్సనల్ గా కూడా మంచి అనుబంధం ఉన్న రాజమౌళి, ఆయనకు యాక్టింగ్, కథల ఎంపిక విషయమై కొద్దిపాటి సలహాలు కూడా ఇచ్చేవారట. ఇక ఎన్టీఆర్ కూడా రాజమౌళిని ముద్దుగా జక్కన్న అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఇక ఎన్టీఆర్, రాఖీ సినిమా చేసే సమయంలో ఎంతో బొద్దుగా ఉండేవారు అనే విషయం తెలిసిందే. 

 

అయితే ఆ సినిమా అనంతరం తనతో యమదొంగ మూవీ ప్లాన్ చేసిన రాజమౌళి, తారక్ నువ్వు ప్రస్తుతం ఉన్న వెయిట్ కరెక్ట్ కాదు, నీ ఫిజిక్ వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ, నువ్వు ఇలానే ఉంటే, రాబోయే రోజుల్లో నీ సినిమాలు కేవలం కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అవుతాయి. అందుకే నువ్వు ఎలాగైనా వెయిట్ తగ్గాల్సిందే అంటూ గట్టిగా నియమం పెట్టారట. తాను మొదటి నుండి ఎంతో అభిమానించే జక్కన్న చెప్పిన మాటని గౌరవించిన ఎన్టీఆర్, అక్కడి నుండి మెల్లగా తన ఫిజిక్ ని తగ్గించుకునే పనిలో నిమగ్నం అయ్యారు. కేవలం కొద్దినెలల్లోనే పూర్తిగా స్లిమ్ గా తయారైన ఎన్టీఆర్, రెట్టించిన ఉత్సాహంతో రాజమౌళి తీసిన యమదొంగలో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ కు కెరీర్ పరంగానే కాక, ఫిజికల్ గా కూడా ఆయన మారడానికి కారకుడయ్యాడు రాజమౌళి ......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: