ఆ స్టార్ హీరోతో పూరి భారీ ప్లాన్ ....... ఎంతవరకు ఫలించేనో .....??
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్ మూవీ ఫైటర్ తీస్తున్న టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వాస్తవానికి గడచిన కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఎంతో సతమతం అయ్యారు. అయితే గత ఏడాది రామ్ హీరోగా తన పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఆయన తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కొట్టి, దర్శకుడిగా ఆయనకు పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. మంచి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు యువత తో పాటు మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ అనంతరం, ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని పూరి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఆ సినిమా తరువాత ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో పూరి సినిమా ఉండబోతోందని సమాచారం. ఆ సినిమా విషయమై ఇప్పటికే ఒక అగ్ర నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న పూరి, దాని కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసారని అంటున్నారు. మంచి మాస్ స్టైల్ లో సాగుతూ, పూరి మార్క్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ హంగులు కలగలిపిన ఆ స్టోరీ కి ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్న పూరి, అతి త్వరలో ఆ స్టార్ హీరోకు కథను విన్పించనున్నారని అంటున్నారు.
గతంలో వచ్చిన పూరి స్టైల్ కమర్షియల్ సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా పక్కా హిట్ గ్యారెంటీ అని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను సైతం మొదలెట్టసారట. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన అనంతరం ఫైటర్ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసి, దానిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని, ఆ వెంటనే పట్టాలెక్కనున్న డబుల్ ఇస్మార్ట్ ని ఎంతో ఫాస్ట్ గా పూర్తి చేయనున్న పూరి, అనంతరం ఈ భారీ ప్రాజక్ట్ ని వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలెట్టనున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం సదరు స్టార్ హీరోతో మూవీ కోసం పూరి వేసిన భారీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ప్రక్కన పెడితే, ఈ వార్త పై అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!