దానికే నా ఫస్ట్ ప్రిఫరెన్క్ అంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు .....!!
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, గడచిన ఈ మూడు నెలల లాక్ డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడుపుతున్నారు. కూతరు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి మధ్యలో పలు సినిమాలు చూస్తూ, సరదాగా ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్, ఆ సమయంలో దిగిన ఫోటోలను మధ్య మధ్యలో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. మొదటి నుండి ఎక్కువగా సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా తన సమయాన్ని సమానంగా కేటాయించే అలవాటున్న మహేష్ బాబు, ఏ మాత్రం వీలుదొరికినా వారితో కలిసి పలు వెకేషన్స్ కు వెళుతూ ఉంటారు.
పెళ్ళికి ముందు బ్యాచిలర్ గా జీవిస్తున్న సమయంలో పూర్తిగా తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉండేదని, ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి, ఏ విధంగా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి తదితర విషయాల పైనే తాను శ్రద్ధ పెట్టేవాడినని, అయితే నమ్రత తో వివాహం అనంతరం తన వైఖరిలో కొంత మార్పు వచ్చిందని అంటారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, తనతో ఎప్పటికప్పుడు సరదాగా గడపడం, అలానే రాబోయే రోజుల్లో ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఉండేలా ఎలా రూపొందించుకోవాలి అనేది కొంత ఆలోచిస్తూ ఉండేవాడినని అన్నారు. నమ్రత తనకు భార్య గా దొరకడం నిజంగా తన అదృష్టం అని ఎప్పుడూ చెప్తుండే మహేష్ బాబు, తనకు కెరీర్ పరంగా కానీ, పర్సనల్ గా గాని ఎటువంటి సమస్య ఎదురైనా తాను ఎప్పుడూ ధైర్యం చెపుతూ తోడూ నీడగా ఉంటుందని అంటారు.
ఇక పిల్లలిద్దరూ పుట్టిన తరువాత, అటు షూటింగ్స్ చేస్తూనే ఇటు పిల్లలతో సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసుకునేవాడినని, డైలీ షూటింగ్ ముగిసిన అనంతరం ఇంటికి వచ్చి హ్యాపీగా పిల్లలతో సరదాగా ఆడుకోవడం, నమ్రతతో హ్యాపీ గా కబుర్లు చెప్పడం వంటివి చూస్తుంటానని మహేష్ అంటారు. అలానే నమ్రత కూడా పిల్లలని, ఇంటి విషయాలని చక్కగా చూసుకుంటుందని, అది కూడా తనకు కొంత రిలీఫ్ అని మహేష్ చెప్పారు. తనకు పార్టీలు, పబ్ కల్చర్, వంటివి మొదటి నుండి పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పే మహేష్, తన లైఫ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎప్పటికీ ఫ్యామిలీకే ఇస్తానని అంటారు....!!