20 ఏళ్ల తన ప్రయాణం అభిమానులతో పంచుకున్న ముద్దుగుమ్మ..!
బాలీవుడ్లో తనదైన నటనతో భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న నటి ప్రియాంకా చోప్రా.. సినీ కెరీర్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మైలురాయికి గుర్తుగా చిన్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వేడుకలో తనతో కలిసి పాల్గొనాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చిందీ ముద్దుగుమ్మ.బాలీవుడ్లో విభిన్న పాత్రలను పోషించి.. తన నటన, అభినయంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని కలలు కన్న ఈ ముద్దుగుమ్మ.. ముఖానికి రంగేసుకొని చిత్రపరిశ్రమలోకి వచ్చింది. అంతేకాదు సినీ కెరీర్లో 20 వసంతాలనూ పూర్తి చేసుకుంది.
తాజాగా ఈ అరుదైన మైలురాయికి గుర్తుగా తన ప్రణాళికలను వెల్లడించింది ప్రియాంక. ఈ 20 ఏళ్ల తన ప్రయాణంలో భాగంగా 20 మధుర స్మృతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకోనున్నట్లు తెలిపింది. వర్చువల్ వేడుకలో తనతో కలిసి పాల్గొనాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చింది.2020 నాటికి వినోద పరిశ్రమలో నేను 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ఇది నిజంగా వేడుక సమయం. ఈ ప్రయాణంలో మీరందరూ నాకు తోడుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే మైలురాయికి గుర్తుగా చిన్న కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నా. ఈ 20 ఏళ్లనాటి నా మధుర స్మృతులను మీతో పంచుకుంటా.. మీరు కూడా ఈ వేడుకలో నాతో కలిసి పాల్గొనండి అని ప్రియాంక అన్నారు.
2000 సంవత్సరంలో 'మిస్ వరల్డ్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించింది. హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా తనదైన టాలెంట్‌తో రాణించింది.బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్ళిన ప్రియాంక తనదైన నటనతో రెండు చోట్ల తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. టాలీవుడ్ లో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు సంపాదించ కపోయినా.. ప్రియాంక తన అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుంది.
auto 12px; width: 50px;">View this post on InstagramIt’s time for a celebration… {{RelevantDataTitle}}