సోషల్ మీడియాలో కింగ్స్ మనవాళ్లే.. !

NAGARJUNA NAKKA

తెలుగు సినిమానే కాదు... హీరోలు కూడా వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోలకు ఇండియావైడ్ క్రేజ్ ఉన్నా.. మన వాళ్లముందు తక్కువే. బాహుబలి ఖాన్ త్రయం రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది. రజినీకాంత్.. విజయ్ లాంటి స్టార్స్ మన హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. క్రేజ్ విషయంలో మన వాళ్ల తర్వాతే. ముఖ్యంగా సోషల్ మీడియాను మన స్టార్స్ ఏలుతున్నారు. 

 

సోషల్ మీడియా చూస్తే.. మనవాళ్లకున్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. కరోనా టైమ్ లో సోషల్ మీడియాతో ఎక్కువ సమయం కేటాయించి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. ఈ క్రమంలో సౌత్ తోఎక్కువ మంది అనుచరులున్న హీరోలు ముగ్గురు మనవాళ్లే కావడం విశేషం. మహేశ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ దే టాప్ ప్లేస్. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న రికార్డులు మనవాళ్లకే సొంతం. 

 

సోషల్ మీడియాపై మహేశ్ మనసు పారేసుకున్నాడు. గతంలో మాదిరి ఎప్పుడో ఒకసారి సిినిమా రిలీజైన టైమ్ లో మాత్రమే కబుర్లు చెప్పే మహేశ్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా టైమ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. పిల్లలతో కలిసి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో సూపర్ స్టార్ ను ఫాలో అయ్యే వారు సంఖ్య కోటికి చేరింది. 

 

స్టార్ హీరోల విశేషాలు.. సినిమా సంగతులు తెలియాలంటే.. వాళ్ల సోషల్ మీడియాలో ఫాలో కావాల్సిందే. మహేశ్ తన మనసులోని భావాలను.. ఆలోచనలను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటూ.. ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నాడు. కోటి మంది అనుచరులతో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోల్లో మహేశ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. 

 

ప్రభాస్ ఫేస్ బుక్ కింగ్ గా నిలిచాడు. బాహుబలి సిరీస్ ఇండియా మొత్తం ఘన విజయం సాధించడంతో.. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ క్రేజ్ ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ ను అనూహ్యంగా పెంచేసింది. సౌత్ ఇండియా హీరోల్లో ఎక్కువ మంది అనుచరులు ఉన్న హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు ప్రభాస్. సౌత్ లో ఏ హీరోకూ లేని విధంగా 60లక్షల మంది అనుచరులతో ఫేస్ బుక్ లో వెలిగిపోతున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. 

 

ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైమ్ లోనే 80లక్షల మంది ఫాలోవర్స్ ను 
వెనకేసుకొని గ్రేట్ అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ రికార్డ్ సాధించిన తొలి సౌత్ హీరో కూడా మనవాడే కావడం విశేషం. సౌత్ లో రజినీకాంత్.. మమ్ముట్టి.. కమల్, మోహన్ లాల్ లాంటి సీనియర్స్ ఉన్నా.. విజయ్, అజిత్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా.. సోషల్ మీడియాను శాసిస్తోంది మనవాళ్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: