ఆషాఢ మాసంలో ముద్దుగుమ్మల డిస్కౌంట్ !
ఆషాఢ మాసంలో బట్టలకు మఖ్యంగా ఆడవాళ్ల చీరలకు భారీ ఢిస్కౌంట్ ఇస్తారు. అయితే 2020 ఆషాఢంలో ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ ఇచ్చారు. ముఖ్యంగా కాజల్, రకుల్ ఊహించనంత రెమ్యునరేషన్ తగ్గించేశారు. ఎవరు ఎంత తీసుకుంటున్నారో.. ఎంత తగ్గించారో ఓ సారి పరిశీలిస్తే..
కాజల్ కు చిరంజీవి ఆచార్య తప్ప.. రకుల్ కు నితిన్ మూవీ చెక్ తప్ప మరో ఆఫర్ లేదు. రకుల్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. అసలు అమ్మడిని టాలీవుడ్ మర్చిపోయి రెండళ్లయింది. దీంతో ఏమీ చేయలేక.. ఇంట్లో కూర్చొని యోగాలు చేసుకుంటూ.. వాటిని సోషల్ మీడియాలో పెడుతూ.. తనని తాను జనాలకు పరిచయం చేసుకుంటోంది. అసలే ఛాన్సులు నిల్. కరోనా టైమ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయనుకోవడం భ్రమ. ఈ విషయాలు తెలియని తెలివి తక్కువ హీరోయిన్ కాదు. అందుకే పారితోషికంలో 50పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిందట.
రకుల్ ఫుల్ ఫామ్ లో ఉన్న టైమ్ లో 60లక్షలకు పైగా డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. 30..40.. లక్షలు వచ్చినా చాలనుకుంటోంది. అందుకే రెమ్యునరేషన్ తగ్గించుకున్న సంకేతాలు మేనేజర్ తో పంపించిందట.
కరోనా మహమ్మారి ముద్దుగుమ్మల మైండ్ సెట్ మార్చేసింది. ఇలాంటి టైమ్ లో వచ్చిందే రెమ్యునరేషన్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. రెండు కోట్లు డిమాండ్ చేసిన చందమామ.. ఆచార్య కోసం కోటిన్నర తీసుకుందని టాక్. కొత్త సినిమాలు ఎనౌన్స్ చేసే హీరోలు.. దర్శకులకు అందుబాటులోకి రావడానికి పారితోషికంలో 50శాతం కోత విధించుకుంది. మరి ఈ ఆషాడం డిస్కౌంట్ ప్రస్తుతానికే పరిమితమా.. కరోనా తగ్గిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందో లేదా చూడాలి.
ఆషాఢ మాసంలో బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు కాజల్, రకుల్. మరి వీళ్లను ఆదర్శంగా తీసుకొని ఎంతమంది ఇలాంటి ఆఫర్ ప్రకటిస్తారో చూడాలి.