ఆలియాభట్ కి సిగ్గు లేదన్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్..!
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటీనటుల్లో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా నటీమణులు గళం విప్పి తమ అభిప్రాయాలను నేరుగా చెబుతుంటారు. ముఖ్యంగా బాగా ఫేమస్ అయిన హీరోయిన్లపై విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కరీనా కపూర్ వంటి హీరోయిన్లు చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలకు గురయ్యారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో అరంగేట్రం చేసిన నటీనటుల పై కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తారు ఇతర నటీనటులు.
నిజానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటేనే సినీరంగంలో ఎవరైనా రాణించగలరు. ఆలియా భట్ కూడా తన నటనా ప్రతిభతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఐతే కంగనా రనౌత్ ఆమెను ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఆలియా భట్ పై కంగనారనౌత్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఎన్నో విమర్శలు చేసింది కానీ ఆలియా భట్ మాత్రం ఆమెపై ఏనాడు నోరు పారేసుకోలేదు. తాజాగా ఆమె మాట్లాడుతూ అవార్డు ఫంక్షన్ లో కొంతమంది నటీనటులకు అవమానం జరుగుతుందని తీవ్రస్థాయిలో మండిపడింది. కొందరి నటీనటులు అర్హత లేకపోయినా ఏమాత్రం సిగ్గులేకుండా ఎంచక్కా అవార్డులను అందుకున్నారు అని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కంగనారనౌత్ తో మాట్లాడుతూ... 'హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో నటించినందుకు గాను దీపికా పదుకొనేకి అవార్డు లభించింది. అయితే ఆమె ఆ అవార్డును స్వీకరించేందుకు అంగీకరించలేదు. ఎందుకంటే క్వీన్ సినిమాలో నా నటన ప్రదర్శన ఆమె నటన అంటే చాలా గొప్పగా ఉందని స్వయానా దీపికా పదుకొనే నే చెప్పింది. కానీ కేవలం గల్లీ బాయ్ సినిమాలో కేవలం పది నిమిషాలు మాత్రమే నటించిన ఆలియా భట్ మాత్రం అవార్డు రాగానే సిగ్గులేకుండా స్వీకరించింది. ఇటీవల ఆత్మహత్య చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా 'చిచోరే' కి కనీస ప్రశంసలు దక్కలేదు', అని ఆమె మండిపడింది.