యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా పాజిటీవ్..!

Edari Rama Krishna

సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లు గా పరిచయం అయి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  అందుకు ప్రయ‌త్నాలు కూడా మొదలు పెట్టారట. అర్జున్‌కి తెలుగులో చాలామంది ద‌ర్శకులు, నిర్మాత‌ల‌తో మంచి అనుబంధం ఉంది. దాంతో త‌న కూతురిని పరిచయం చేయమని అడుగుతున్నట్టు ఇటీవల తెగ వార్తలు వచ్చాయి.  ఇందులో భాగంగానే ఐశ్వర్య కూడా హైద‌రాబాద్ వ‌చ్చి కొంత‌మంది ద‌ర్శక నిర్మాతలని క‌లిసిందట. కొన్ని ఫోటో షూట్స్ కూడా జరిగాయని అంటున్నారు. ఇక త్వర‌లోనే ఐశ్వర్య టాలీవుడ్‌లో ఒక యంగ్ హీరో నటించే చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందట. 

 ఐశ్వర్యకు తొలి అవకాశం ఎవరిస్తారో.. ఏ హీరో సరసన హీరోయిన్‌గా పరిచయమవు తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అర్జున్ అటు తమిళంలో ఇటు తెలుగు లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే తాజాగా  అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఐశ్వర్యకు పాజిటివ్‌గా రావడంతో ప్రస్తుతం ఆమెను ఇంటి వద్దే హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఈ వార్తను స్వయంగా ఐశ్వర్యానే కన్ఫర్మ్ చేశారు. రీసెంట్‌గా హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు ధ్రువ్ సర్జాతోపాటు ఆయన వైఫ్‌కు పాజిటివ్‌గా తేలింది.  ఈ నేపథ్యంలో ‘ఇటీవలే నాకు కరోనా టెస్టులు చేశారు.

అందులో పాజిటివ్‌గా రావడంతో నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నా. ప్రొఫెషనల్ మెడికల్ టీమ్ సూచనల మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. గత కొన్ని రోజుల్లో నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి వద్దే క్షేమంగా ఉండండి. మాస్కులు తప్పక కట్టుకోండి. మెరుగైన ఆరోగ్యంతో త్వరలో మీ ముందుకు వస్తా’ అని ఐశ్వర్య చెప్పింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: