హాట్ లుక్స్‌తో కవ్విస్తున్న ప్రియాంక చోప్రా!!
ప్రియాంకా చోప్రా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అసవరం లేదు. బాలీవుడ్ నించి హాలీవుడ్ వరకూ తన లైఫ్‌స్టైల్‌ని తానే తీర్చిదిద్దుకున్న గ్రేట్ విమెన్ ఈమె. ఇక ఈ అమ్మడు వయసు ఇంకో సంవత్సరం పెరిగింది. జులై 18న ఆమె 38వ ఏట అడుగుపెట్టింది.
నేడు ప్రియాంక బర్త్‌డే సందర్భంగా.. ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక `ద హీరో - లవ్ స్టోరీ ఆఫ్ అ స్పై` అనే చిత్రం ద్వారా ఇండిస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన ప్రియాంక.. ఇటీవల అమెరికన్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లాడింది.
ఇక పెళ్లి తర్వాత కూడా ఈ అందాల తారకు ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, హీరో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటించిన ‘ది వైట్ టైగర్’ను నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
సూపర్ హీరో చిత్రం ‘వి కెన్ బీ హీరోస్’లో కూడా ప్రియాంక నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రియాంక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది. తాజాగా కూడా ప్రియాంక హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.