ప్రభాస్ మూవీ కోసం భారీ క్యాస్టింగ్ నే తీసుకున్నట్లున్నారే....??

GVK Writings

రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నటించిన సాహో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఎంతో గ్రాండ్ లెవెల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అయితే కాలేదు. ఇకపోతే దాని తరువాత జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమయిన ప్రభాస్, ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాని కొన్నేళ్ల క్రితం యూరోప్ దేశంలో జరిగిన రెట్రో ప్రేమకథగా పలు భారీ హంగులతో దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు గోపికృష్ణ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి భాగ్య శ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తుండగా కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రేపు ఉదయం ఈ సినిమా అఫీషియల్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా మాధ్యమాల్లో హడావుడి మొదలెట్టేసారు. కాగా ఈ సినిమాలో భారీ స్థాయి స్టార్ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ, కృష్ణంరాజుతో పాటు కమెడియన్ ప్రియదర్శి, తమిళ నటుడు సత్యన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సచిన్ ఖేడేకర్, ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి, బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్, ప్రముఖ నటుడు మురళి శర్మ సహా మరికొందరు ఇతర తారాగణం నటిస్తున్నారట. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో ఈ విధంగా భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: