తండ్రి ఆరోగ్యంపై రామ్ చరణ్ శ్రద్ధ.. !
చిరంజీవి గైడెన్స్ తోనే రామ్ చరణ్ కెరీర్ బిల్డప్ చేసుకుంటున్నాడని ఇన్నాళ్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడా సిట్యువేషన్స్ మారిపోయాయి. చెర్రీ సలహాతోనే చిరు ముందుకెళ్తున్నాడని చెప్పుకుంటున్నారు. కొడుకు మాట మీదే చిరు నడుచుకుంటున్నాడని, సినిమాల విషయంలోనూ చరణ్ చెప్పినట్టుగా చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. అంటే మెగా క్యాంపులో రామ్ చరణ్ జమానా మొదలయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చిరంజీవి డైరెక్ట్ చేస్తుంటాడు. చిరు సలహాలతోనే మెగా హీరోలంతా ముందుకెళ్తుంటారు. అలాంటి చిరంజీవిని ఇప్పుడు రామ్ చరణ్ అడ్వైజ్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆచార్య షూటింగ్ కూడా చెర్రీ ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందని టాక్.
చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా మొదలు పెట్టాడు. అయితే లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇక రీసెంట్ గానే షూటింగ్ లకు అనుమతులు రావడంతో ఆచార్యని సెట్స్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారు చిరు, కొరటాల. కానీ రామ్ చరణ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కరోనా తీవ్రత తగ్గేవరకు సెట్స్ కి వెళ్లొద్దని చిరుకి చెప్పేశాడు నిర్మాత చరణ్.
తండ్రి హెల్త్ ను రిస్క్ లో పెట్టాలనుకోవడం లేదు రామ్ చరణ్. పైగా ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే కోవిడ్ తీవ్రత తగ్గే వరకు నో షూటింగ్స్ అని చెప్పేశాడట చరణ్. ఇక చిరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కూడా చరణ్ సలహాలు ఇచ్చాడు. సో ఇదంతా చూస్తే రామ్ చరణ్ తన తండ్రి గురించి బాగా కేర్ తీసుకుంటున్నాడని చెప్పొచ్చు. మొత్తానికి రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి ఆరోగ్యంపై చాలా శ్రద్ధపెడుతున్నాడు. అందుకే షూటింగ్ లు ఎపుడు పెట్టాలో ఎపుడు పెట్టకూడదో తానే నిర్ణయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్.