సాయి తేజ్ స్లిమ్ ఫిట్ స్టార్ అయిపోయాడా.. ?

NAGARJUNA NAKKA

కరోనా లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ ని హీరోలంతా పర్ ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. ఫిట్ నెస్ గోల్స్ ని రీచ్ అవుతున్నారు. ఫిట్టెస్ట్ యాక్టర్స్ గా మారుతున్నారు. మరి స్లిమ్ గా మారాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న సాయి తేజ్ ఈ లాక్ డౌన్ లో లావు తగ్గాడా.. స్లిమ్ ఫిట్ స్టార్ గా మారిపోయాడా.. ఇవే సందేహాలు మెగా అభిమానుల్లో నెలకొన్నాయి. 

 

సుప్రీం తర్వాత సాయితేజ్ గ్రాఫ్ కొంచెం పడిపోతే.. వెయిట్ మాత్రం చాలా పెరిగింది. తిక్క, విన్నర్, తేజ్ ఐ లవ్ యూ కి వచ్చేసరికి హెవీగా మారిపోయాడు సాయి. మెగా ఫ్యాన్స్ కూడా అల్లుడి లుక్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. దీంతో చిత్రలహరికి ముందు కొంచెం గ్యాప్ తీసుకొని బరువు తగ్గాడు. ఇక ప్రతి రోజూ సినిమాకు మరికొంచెం వెయిట్ తగ్గాలని ట్రై చేశాడు. కానీ టైమ్ సెట్ అవ్వలేదు. 

 

కరోనా లాక్ డౌన్ ని కొంతమంది హీరోలు వెడ్ లాక్ గా మార్చుకున్నారు. రానా, నిహారిక లాంటి వాళ్లు లైఫ్ పార్టనర్స్ ని సెలక్ట్ చేసుకున్నారు. నిఖిల్ ఈ లాక్ డౌన్ లోనే ఏడడుగులు వేశాడు. నితిన్ 2020 లోనే పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది. 

 

సందీప్ కిషన్, అడివి శేష్ లాంటి హీరోలైతే ఈ లాక్ డౌన్ ని వర్కవుట్ సెషన్ గా మార్చుకున్నారు. సందీప్ సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే.. అడివి ఫిట్ గా మారాడు. ఇక వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఎన్నాళ్ల నుంచో వెయిట్ తగ్గాలనుకుంటున్న సాయి తేజ్ స్లిమ్ ఫిట్ గా మారాడా అంటే లేదు అంటున్నారు నెటిజన్లు. మంచు మనోజ్ పెట్టిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తేజ్ కొంచెం లావుగానే కనిపించాడు. దీంతో తేజ్ వెయిట్ లాస్ పై ఫోకస్ పెట్టట్లేదా అని కామెంట్ చేస్తున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: