సిక్స్ ఫీట్ లో స్టార్ హీరోల కొడుకులు !

NAGARJUNA NAKKA

హీరో సిక్స్ ఫీట్ ఉంటే.. ఎన్నో పాటలు పుట్టుకొస్తాయి. ఆరడుగుల బుల్లెట్ అంటూ.. పాడేసుకుంటారు. రాబోయే కాలంలో వచ్చేవన్నీ ఇలాంటి పాటలే. ఎందుకంటే.. మన హీరోల వారసులు సిక్స్ ఫీట్ మించిపోయారు. ముగ్గురు స్టార్ హీరోల కొడుకులు.. ప్రేక్షకులను తలెత్తుకు తిరిగేలా చేస్తున్నారు. రాబోయే కాలం అంతా.. సిక్స్ ఫీట్ హీరోలదే. 

 

ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ టైమ్ లో ఆరడుగుల హీరోలు కనిపించకపోయినా.. ఆ తర్వాత రామకృష్ణ రూపంలో సిక్స్ ఫీట్ హీరో దొరికాడు. ప్రస్తుతమున్న హీరోల్లో మహేశ్.. రానా.. వరుణ్ తేజ్ ఆరు ఆడుగులతో ఆకట్టుకున్నారు.చూస్తుంటే మున్ముందు వచ్చే వారసులందరూ... ఆరడుగులు మించిపోతున్నారు. 

 

వెంకటేశ్ ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ లో తప్ప బయట ఎక్కడా కనిపించదు. రానా, మిహికా బజాజ్ రోకా ఈవెంట్ లో వెంకటేశ్ వారసుడు అర్జున్ కనిపించాడు. 20ఏళ్ల లోపు ఉండే ఈ దగ్గుబాటి వారసుడు ఆరడుగులు కనిపిస్తున్నాడు. రానా మాదిరి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో  హైట్ హీరో వెండితెరకు పరిచయమవుతాడేమో చూడాలి.

 

అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకు చిన్నపిల్లాడిలా కనిపించిన అకీరా.. మాంచి హైట్ తో కనిపిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ మొత్తంలో ఈ కుర్రాడే హైట్ ఎక్కువ. ఆరడుగుల నాలుగు అంగుళాలతో ఔరా అనిపిస్తున్నాడు. 

 

ఇంకా హీరోగా నటించే వయసు రాకుండానే.. మహేశ్ బాబు వారసుడు 5అడుగుల 10 అంగుళాలు కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో తండ్రీ కొడుకులు ఇద్దరూ హైట్ కొలుచుకుంటున్న వీడియో ఆకట్టుకుంది. నువ్వా నేనా అన్నట్టు హైట్ లో తండ్రితో పోటీపడుతున్నాడు ఈ వారసుడు. మొత్తానికి రాబోయే రోజుల్లో హీరోలందరూ ఫుల్ హైట్ తో మెప్పించబోతారని తెలుస్తోంది. అందుకు నిదర్శనమే ఈ హీరోల పుత్రులు. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేశ్ కొడుకులు ఇంత ఇంత హైట్ లో ఉండటం చూసి.. స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: