"వకీల్ సాబ్" సెట్స్ పై ఉండగానే మరో భారీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన PSPK..!

Suma Kallamadi

మొన్నటి దాకా రాజకీయాల్లో బిజీ గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా లు  చేవడానికి ఒప్పుకోవడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇప్పటికే హిందీ చిత్రం 'పింక్' కు రీమేక్ గా 'వకీల్ సాబ్' పేరుతో బిజీగా ఉన్నారు పకం కళ్యాణ్.ఈ సినిమా షూటింగ్ పనులు అన్ని పూర్తి చేసుకొని విడుదల చేసే టైమ్ కి లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయన అభిమానుల ఆశల్లో నీళ్లు చల్లినంత పని అయింది. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మరో తీపి కబురు అందించబోతున్నారు. వకీల్ సాబ్ ట్రాక్ లో ఉండగానే మరో పెద్ద సినిమాకు ఆయన ఓకే చెప్పారు.

 

 

పవన్ కళ్యాణ్ వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు  జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'వకీల్ సాబ్' సెట్స్ పై ఉండగానే క్రిష్ సినిమా ఓకే చేసేశాడు పవన్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. గత ఏడాది లో ఆయన తీసిన సినిమాలు ఘోర పరాజయం పాలవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు క్రిష్.  ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం. అయితే కరోనా పరిస్థితుల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణ పనులను మొదలపెట్టనున్నారని సమాచారం. ఈ సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు.

 

 

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ - క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే ఉండబోతున్నాయట. ఈ సాంగ్స్ కూడా కథలో భాగంగా సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఉంటాయని సినీ వర్గాలు సమాచారం. ఇప్పటికే ఈ రెండు పాటలకు కీరవాణి ట్యూన్స్ రెడీ చేశారట. సినిమా మొత్తం పిరియాడిక్ బాక్ డ్రాప్ కాబట్టి ముఖ్యంగా కథ ఆధారంగానే సినిమా ఉంటుందట. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో అందిస్తారో మనం గతంలో చూసాం. మరి ఈ సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తారో చూడాలి.  

 

 

కాగా మొఘలాయుల కాలంలో మంచి కోసం పోరాడే ఓ హిస్టారికల్ పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉందని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇస్తున్నట్లే. కేవలం తన అభిమానులే కాదు యావత్ సినీ ప్రపంచం పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: