సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మరో బాలుడు ఆత్మహత్య!
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ఆయన కుటుంబ సభ్యులు అతని మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసినా.. అది ఆత్మహత్యే అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణం డిప్రేషన్, బాలీవుడ్ లో కొనసాగుతున్న బంధుప్రీతి అని అతని సన్నిహిత నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతని మరణం ఎంతో మంది హృదయాలను కలచి వేసింది. ధోని చిత్రంతో ఎంతో మంచి పేరు తెచ్చుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి హీరో ఒక్కసారే ఆత్మహత్య చేసుకోవడం కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్తను ఇప్పటికే ఐదుగురు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. విశాఖపట్నంకు చెందిన ఓ అమ్మాయి, ఒడిశాకు చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడినారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 12 ఏళ్ళ అభిమాని శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం జీర్ణించుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రేటర్ నోయిడాకు చెందిన ఆరో తరగతి కుర్రాడు.. సుశాంత్ ఆత్మహత్య వార్తతో తీవ్రంగా కుంగిపోయాడు.
దీంతో మనోవేదనకు గురై శనివారం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ లాగే ఆ బాలుడు కూడా ఫ్యాన్ కు ఉరివేసుకుని మరణించాడు. ఆ బాలుడు ధోని చిత్రం అంటే తెగ ఇష్టపడేవాడట... ఇప్పటికీ టివిల్లో ధోని చిత్రం వస్తే కదిలేవాడు కాదట.. అలాంటిది సుశాంత్ మరణ వార్త విన్నప్పటి నుంచి ఆందోళనకు గురయ్యాడట. కాగా, అతడు గదిలోకి వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు టీవీలో సుశాంత్‌కు సంబంధించిన వార్తలే చూశాడని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు.