ప్రభాస్ కు పురస్కారాల వెల్లువ..!
బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. తెలుగు సినిమా మార్కెట్ లెవల్ కు వెళ్లింది. అలాగే ప్రభాస్ కెరీర్ లోనూ ఎవరూ ఊహించని ఛేంజెస్ వచ్చాయి. ఈ మూవీ థియేటర్ నుంచి వెళ్లిపోయి మూడేళ్లు దాటుతోన్నా డార్లింగ్ కు ఇంకా అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి.
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుతుందో లేదో తెలియదు గానీ.. ఒకే ఒక్క సినిమా బాహుబలితో ప్రభాస్ కెరీర్ మొత్తం మారిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. ఇండియా వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. లార్జ్ స్కేల్ లో మల్టీలింగ్వల్స్ చేస్తున్నాడు.
బాహుబలితో ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. రష్యాలో అయితే డార్లింగ్ పెర్ఫామెన్స్ కి లక్షల మంది అభిమానులుగా మారారు. ఇక ఈ ఫోలోయింగ్ చూసి.. అక్కడి వాళ్లు రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డ్ కు ఎంపిక చేశారు. 30ఏళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ రాజ్ కపూర్ ఈ అవార్డును అందుకున్నాడు. 420, ఆవారా, ఆరాధన సినిమాలతో రష్యన్స్ కు దగ్గరయ్యాడు రాజ్ కపూర్. మళ్లీ 30ఏళ్ల తర్వాత ఇండియా నుంచి ప్రభాస్ మాత్రమే ఈ అవార్డ్ అందుకున్నాడు.
ప్రభాస్ కు మేడమ్ టుస్సాడ్స్ లోనూ స్థానం సంపాదించి పెట్టింది బాహుబలి. ఇప్పుడు రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డ్ కూడా అందించింది. సో రాజమౌళి ఊహతో డార్లింగ్ మార్కెట్ దేశవిదేశాలకు విస్తరించిందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా, నాగ్ అశ్విన్ తో మరో మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ గానే వస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్ కు రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డ్ రావడంపై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.