ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ ?

Satya

ఉదయ్ కిరణ్. లవర్ బాయ్. 2000 సంవత్సరంలో వచ్చి ఓ ఊపు ఊపేసిన యువ కెరటం. నాడు సీనియర్ హీరోలంతా యాభైల్లోకి వచ్చేసినా లవ్ సినిమాలు చేస్తున్న టైం అది. ఆ టైం లో టీనేజ్  కుర్రాడిగా మూతి మీద మీసం కూడా కనీసం మొలవని ఉదయ్ కిరణ్ వచ్చాడు. ఆ తరువాత అతను రామోజీ రావు గారి ఉషా కిరణ్ మూవీస్ లో తేజా డైరెక్షన్లో ఫస్ట్ ఫిల్మ్ చిత్రం సినిమాతోనే అతి పెద్ద హిట్ కొట్టాడు.

ఆ తరువాత వరసగా  మనసంతా నువ్వే. నువ్వూ నేనూ సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ సొంతం చేసుకుని సీనియర్లకు ఖంగు తినిపించాడు. ఉడుకునెత్తురు  ఎలా ఉంటుందో రుచి చూపించాడు. నిజానికి ఉదయ్ కిరణ్ రావడంతోనే సీనియర్లకు తమ ఏజ్, తమ పొజిషన్ తెలిసిందనుకోవాలి.యూత్ నుంచి అపరిమితమైన క్రేజ్ తో పాటు, లవర్ బాయ్ ఇమేజ్ తో ఆ మీదట ఎన్నో సినిమాలు చేసి ఉదయ్ కిరణ్ తన రేంజిని పెంచుకున్నాడు. సరిగ్గా అనుకోని పరిస్థితుల్లో ఉదయ్ కిరణ్  సినీ జీవితం వేరే వైపు టర్న్ కావడం ఆ తరువాత అసలు సినిమా చాన్సులే ఆయనకు రాకపోవడంతో ఉదయ్ కెరీర్ డల్ అయింది.

ఇక అప్పటి నుంచి డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ ఈ లోకాన్ని వీడేందుకు దారితీసిన పరిస్థితులు తాజాగా సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యూత్ హీరో సుశాంత్ జీవితాన్నే తలపిస్తాయి. మొత్తానికి చనిపోయే ముందు ఉదయ్ చేసిన చివరి సినిమా ఒకటి ఉంది. దాని పేరు చిత్రం చెప్పిన కధ. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఉదయ్ కన్ను మూశాడు.

ఓ విధంగా ఈ సినిమా తన రీ ఎంట్రీకి గ్రాండ్ వెల్కంగా ఉంటుందని ఉదయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఉదయ్ చనిపోయినా ఆయనకు ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. వారంతా ఉదయ్ చివరి సినిమా చూడాలనుకుంటున్నారు ఎటూ థియేటర్లో విడుదలకు నోచుకోని ఈ సినిమా ఇపుడు ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద అయినా రిలీజ్ అయితే చూద్దామనుకుంటున్నారుట. మరి ఉదయ్ మూవీ రిలీజ్ అవుతుందా. చేస్తారా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: