ఫ్యాన్స్ ని సప్రైజ్ చేసిన గోపీచంద్...!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కవైపు హీరో మరోవైపు విలన్ గా నటించి మంచి క్రెజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్. గోపీచంద్ తెలుగు పరిశ్రమలో స్టార్ ప్రముఖ విప్లవ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసుల హవా నడుస్తున్న సమయంలో గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే గోపీచంద్ మొదటి సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేదు.
తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రంలో విలన్ గా నటించాడు. ఈ చిత్రంతో గోపిచంద్ కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నిజం, వర్షం చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన గోపిచంద్ కి హీరో రేంజ్ లో పేరు రావడంతో తర్వాత హీరో అయ్యారు. అయితే గోపీచంద్ కి లౌక్యం చిత్రం మినహా ఈ హీరోకి ఏ సినిమా సక్సెస్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన గౌతం నంద చిత్రం కాస్త పరవాలేదు అనిపించింది.
కొందరు సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ పిక్స్ అడపాదడపా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి వినోదాన్ని అందిస్తుంటారు. మరికొందరు మాత్రం వాళ్ళ పిల్ల గురించి గుట్టుగా పెడుతారు. అభిమానులు వారి అభిమాన హీరో ఫ్యామిలీని చూడాలని ఎన్నో కలలు కంటుంటారు. ఈ నేపథ్యంలో మాచో హీరో మంచి అకేషన్ చూస్ చేసుకొని వారసులని పరిచయం చేశారు.
ఒక తండ్రిగా అత్యుత్తమ భావనతో ఉన్నానన్నారు. మా పిల్లల్ని చూస్తుంటే దేవుని ఆశీస్సులతో సంపూర్ణత సాధించినట్టే అనిపిస్తోందని తెలిపారు. మై లవ్ లీ లిటిల్ వన్స్.. నాకు బలంగా నిలిచినందుకు థాంక్యూ అంటూ వారసులని పరిచయం చేశారు. క్యూట్‌గా ఉన్న గోపిచంద్ వారసులు అభిమానులని ఎంతగానో ఆకర్షిస్తున్నారు. అయితే గోపీచంద్ వారసుడు విరాట్ కృష్ణని ఆయన తండ్రి గారైన టి.కృష్ణతో పోల్చిన అభిమాని అతడి రెండో వారసుడు వియాన్ ని ప్రేమ్ చంద్ గారు అంటూ పోల్చడం విశేషమని తెలిపారు.