ఎన్టీఆర్ సినిమాలలో ప్రేక్షకులకు ముఖ్యంగా నచ్చే అంశాలు ఇవే..వారెవ్వా

Satvika

సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఒక్కోలా కనెక్ట్ అవుతారు.. కొందరు స్టయిల్ చూసి మరికొందరు నటన చూసి .. డ్యాన్స్ సినిమా కథల ఎంపిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వరుసలోకి వస్తాయి అందుకే ఆ హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన హిట్ అవుతుంది.. అదండీ మన తెలుగు హీరోల సక్సెస్ సీక్రెట్ .. ఇకపోతే తెలుగులో చాలా మంది హీరోలు ఇలానే టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు.. 

 

 

 

ఇకపోతే ఒక్కో హీరోలో ఒక్కో అంశం అందరినీ ఆకట్టుకుంది.. అసలు విషయానికొస్తే ఎన్టీఆర్ సినిమాలలో మాత్రం జనాలలో అన్నీ ఆకట్టుకున్నాయ ట.. అవెంటంటె..స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . 

 

 

 


అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.. అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, అలాగే ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు కూడా చాలా మంచిదే.. అందుకే ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. 

 

 


ఎన్టీఆర్ సినిమాలలో సినీ అభిమానులకు నచ్చే అంశాలు అంటే అతని జోష్, అతని డ్యాన్స్, డైలాగు డెలివరీ, కామెడీ టైమింగ్, హీరోయిన్లతో ఆయన చేసే రొమాన్స్ , చమత్కారం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ సినిమాలలో ప్రత్యేక అంశాలు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.. ప్రతికథానాయకుడు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయనున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: