పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు..!

Suma Kallamadi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిగా నందిని ని పెళ్లి చేసుకున్నాడు కానీ అప్పటికే అతడు రేణు దేశాయ్ తో రిలేషన్ షిప్ పెట్టుకోవడం వలన నందిని అతడి నుండి విడాకులు తీసుకుంది. దాంతో పవన్ రేణుదేశాయ్ ని పెళ్లాడి కొన్నేళ్లపాటు సంసారం చేశాడు కానీ పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చని రేణుదేశాయ్ కూడా అతడి నుండి విడాకులు తీసుకుంది. దాంతో పవన్ కళ్యాన్ తాను హీరోగా నటించిన తీన్ మార్ సినిమా లో ఓ చిన్న పాత్రలో కనిపించిన రష్యన్ ముద్దుగుమ్మ ఐన అన్నాలెజ్నోవా ని 2013 లో వివాహమాడాడు.

wife Anna ..." />
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్ లో కలుసుకున్న వీళ్లిద్దరి మధ్య స్నేహం, ప్రేమ పుట్టుకొచ్చిందని సినీ వర్గాల ప్రముఖులు చెబుతుంటారు. రేణు దేశాయ్ తో విడాకులు తీసుకోకముందుకే పవన్, అన్నాలెజ్నోవా ఘాడమైన రిలేషన్ షిప్ లో ఉండి ఓ పండంటి బిడ్డకు కూడా తల్లిదండ్రులు అయ్యారని సమాచారం. అయితే పవన్ మొదటిగా పెళ్లి చేసుకున్న నందిని, రేణు దేశాయ్ లు అతడి ప్రవర్తన భరించలేక విడాకులు తీసుకున్నారు కానీ తెలుగు భాష కూడా రాని అన్నాలెజ్నోవా మాత్రం పవన్ తో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. పవన్ సినిమాలంటూ, రాజకీయాలంటూ కుటుంబానికి దూరంగా ఉంటున్నప్పటికీ... అన్నాలెజ్నోవా మాత్రం పవన్ పై ఏ మాత్రం కోపం చూపించకుండా... తన ఇద్దరు పిల్లలను గారాబంగా చూసుకుంటుంది. పిల్లలకు తండ్రి ప్రేమను కూడా తానే చూపిస్తూ అసలు సిసలైన మాతృమూర్తిగా... విదేశీ వనితలకు పూర్తి భిన్నంగా ఉంటూ అందరి చేత ప్రశంసలు దక్కించుకుంటుంది. ఈమె రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ... మన భారతదేశ సంస్కృతికి ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తూ చీరలు కట్టుకుంటుంది, నుదుట బొట్టు పెట్టుకుంటుంది. 


చిరంజీవి, నాగబాబు కుటుంబాలలో జరిగే ప్రతి శుభకార్యానికి విచ్చేసే అన్నా లెజ్ నోవా చాలా సాంప్రదాయంగా తయారయ్యి అందరిని నవ్వుతూ పలకరిస్తూ చాలా చక్కగా కలిసి పోతుంది. పవన్ కళ్యాణ్ కోపంలో ఒక మాట తిట్టినా ఆమె ఓర్చుకుంటుందని సన్నిహితులు చెబుతుంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ని మంచిగా అర్థం చేసుకొని తనకి ఫర్ఫెక్ట్ వైఫ్ గా, తన పిల్లలకు మంచి అమ్మ గా తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తుందే తప్ప స్టార్ హీరో భార్య హోదా లో ఉన్నానని గొప్పలకు పోవడం గానీ ఇష్టారాజ్యంగా పవన్ సంపదలను ఖర్చు చేయడానికి గానీ ఆమె ఆసక్తి చూపదు. అతి సామాన్యురాలు గా అన్నాలెజ్నోవా తన జీవితాన్ని గడపడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: