అది నా కల.. దానికోసం నటన కూడా వదిలేస్తా : రాధికా ఆప్టే
ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీల కు చాలా ఖాళీ సమయం దొరకడం తో ఇంటిపట్టునే ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తు... కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లో అందాల ముద్దుగుమ్మ రాధిక ఆప్టే తన ఫ్యూచర్ లో ఏమి అవ్వాలి అనుకుంటున్నానో చెప్పుకొచ్చింది. తను ఒక రెస్టారెంట్ ను స్థాపించి ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా ఎదగాలి అనుకుంటున్నట్లు తాజాగా రాధిక ఆప్టే చెప్పుచ్చింది. అయితే ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు నటనలో రాణించడంతో పాటు వ్యాపారంలో కూడా తమదైన అదృష్టాన్ని పరీక్షించుకుని ఎంతోమంది విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధిక ఆప్టే కూడా వాళ్ల బాటలోనే నడుస్తాను అంటుంది. రెస్టారెంట్ బిజినెస్ లో అడుగు పెట్టాలని ఉంది అని... ఒకవేళ తాను రెస్టారెంట్లు ప్రారంభిస్తే నటనకు దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి ఆలోచన తనకు ఎప్పుడో వచ్చేదని... తన కల ఏదో ఒక రోజు తప్పక నెరవేరుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే, అదే సమయంలో లాక్ డౌన్ ద్వారా దొరికిన ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుందో కూడా చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే. లాక్‌డౌన్ సమయంలో కొన్ని కథలను వ్రాసినట్లు చెప్పుకొచ్చింది.
గత ఎనిమిది వేల నుంచి కొంచెం కూడా సమయం దొరకకుండా ఎంతో బిజీ బిజీగా ఉన్నాను అంటూ తెలిపిన ఈ అమ్మడు... ప్రస్తుతం ఎక్కువ సమయం లాక్ డౌన్ రావడంతో తనకోసం కొంత సమయం కేటాయించుకుని అవకాశం కూడా దక్కింది అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అయితే వరుస సినిమాలతో బాలీవుడ్లో ఎంతగానో క్రేజ్ సంపాదించిన రాధిక అయితే ఇటీవల దర్శకురాలిగా కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ది స్లీప్ వాకర్స్ అనే ఒక షార్ట్ ఫిలిం కి దర్శకత్వం కూడా వహించారు రాధిక ఆప్టే. అయితే దర్శకురాలిగా ఉండటం తనకు ఎంతో నచ్చింది అంటూ చెప్పుకొచ్చింది, ఇక తన షార్ట్ ఫిలిం పై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది అభిప్రాయం తెలుసుకోవాలని ఉందని అందుకనే తన షార్ట్ ఫిలిం విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.