బన్నీకి అక్కగా సుమా..!
మన తెలుగులో యాంకర్ సుమాకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల్లో నటించకపోయినా సరే ఆమెకు మాత్రం మంచి గుర్తింపు అనేది ఉంది. యాంకర్ గా ఆమె తెలుగు ప్రేక్షకులు అందరికి దగ్గరయ్యారు. అప్పుడెప్పుడో యాంకరింగ్ స్టార్ట్ చేసిన సుమా ఇన్నేళ్లు అవుతున్నా ఎంతో మంది కుర్ర .. హాట్ యాంకర్ల పోటీ తట్టుకుని మరీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇక సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం చేయకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. అవకాశం వచ్చినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమాలు చెయ్యాలని భావిస్తున్నారు.
ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే సమ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఆ తర్వాత యాంకరింగ్‌లో కి వచ్చాక తిరుగులేకుండా దూసుకు పోయింది. ఆ తర్వాత ఆమె ఇప్పటి వరకు ఆమె సినిమాల్లో ఎప్పుడు కూడా కనపడలేదు. అయితే ఇప్పుడు ఆమె సీనియర్ యాంకర్ కావడం యువ యాంకర్ లు ఎక్కువగా రావడం తో ఆమె ఇప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చెయ్యాలి అని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి అక్కగా నటించే అవకాశం ఉందని సమాచారం.
ఆమె ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాలో అనసూయకు కెరీర్ లోనే మర్చిపోలేని పాత్ర ఇచ్చారు. ఇప్పుడు పుష్ప సినిమాలో నూ సుమకు అదే తరహా పాత్ర డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాలో ఉంటున్నారు అని ప్రకటన కూడా వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇప్పుడు ఆమె యాంకర్ గా షో లను తగ్గించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఏ సినిమాల్లో ఆమె నటిస్తారు అనేది చూడాలి.