జేెజెమ్మ మార్కెట్ లో బేబీ పాగా !
అనుష్క ప్లేస్ ను ఆక్రమిస్తోంది సమంత. జేజెమ్మగా బాక్సాఫీస్ దగ్గర కత్తి తిప్పిన స్వీటీని వెనక్కి నెడుతూ, రేసులో ముందుకొచ్చేస్తోంది సామ్. దేవసేనకు ఉన్న ఒక్క ఆప్షన్ ను కూడా లాక్కుంటూ.. ఈమె కెరీర్ కు ఎర్త్ పెడుతోంది రామలక్ష్మి.
టాలీవుడ్ లో ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న హీరోయిన్ అనుష్క. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలతో హీరోయిన్ మూవీస్ కు బెస్ట్ ఆప్షన్ అనిపించుకుంది. అలాంటి హీరోయిన్ కు ఇప్పుడు సమంత ఎర్త్ పెడుతోంది. జేెజెమ్మ మార్కెట్ లో బేబీ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.
సైజ్ జీరో తర్వాత అనుష్క కెరీర్ స్లంపులో పడింది. ఈ మూవీ కోసం పెరిగిన బరువుకు గ్రాఫ్ మొత్తం పడిపోయింది. మళ్లీ ఎంత ప్రయత్నించినా అనుష్క మునుపటి లుక్ లోకి రాలేకపోతోంది. అలాగే కెరీర్ కూడా ఇంతకు ముందులా స్పీడ్ అందుకోవడం లేదు. దీంతో అనుష్క కెరీర్ క్లైమాక్స్ కు చేరిందనే టాక్ వస్తోంది.
అనుష్కకు కమర్షియల్ మూవీస్ తగ్గిపోయి.. కెరీర్ కష్టాల్లో పడినప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు షిఫ్ట్ అయింది. బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లోనే నటిస్తోంది. భాగమతి, నిశ్శబ్ధం లాంటి కథలతో మార్కెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలకు ఇప్పుడు సమంత అడ్డుగా మారుతోంది.
సమంత కెరీర్ లో వచ్చిన మార్పులు అనుష్కకు అడ్డంకిగా మారాయి. సామ్ సెకండ్ ఇన్నింగ్స్, స్వీటీకి బ్రేకులు వేస్తోంది. రుద్రమ దేవికి రావాల్సిన అవకాశాలు అక్కినేని కోడలి వైపు చూస్తున్నాయి. దీంతో స్వీటీ డైరీలో ఖాళీలు పెరుగుతున్నాయి. సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు తగ్గించింది. హీరోయన్ కు స్కోప్ ఉన్న మజిలీ లాంటి చిత్రాలు, లేదంటే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది. యూ-టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో సందడి చేస్తోంది. ఇక సమంత హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ వైపు రాగానే.. ఈ జానర్ కథలు ఎక్కువగా ఈమె వైపే వెళ్తున్నాయి.