రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్... అప్పటివరకు తీర్చలేదట..!

Suma Kallamadi

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మనసు బంగారం అని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఎవరైనా చేయి చాపి అడిగితే దానం చేసే గుణం ఉన్న రామ్ చరణ్ అపోలో ఆస్పటల్ యజమాని మనవరాలైన ఉపాసన ని వివాహమాడాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలకంటే చిరంజీవి, రామ్ చరణే అత్యంత ధనవంతులుగా చెప్పవచ్చు. చిరంజీవి విషయం గురించి పక్కన పెడితే... రామ్ చరణ్ నిర్మాతలకు చాలా సహాయం చేస్తుంటాడు. సినిమా హిట్ అయితేనే తనకు పారితోషకం ఇవ్వాలని చెప్పేంత గొప్ప మనసున్న రామ్ చరణ్ తన సొంత బాబాయి అయిన పవన్ కళ్యాణ్ డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? అని ప్రశ్నిస్తే.. ఎందుకు ఇవ్వరని ఎదురు ప్రశ్న కచ్చితంగా ఎదురవుతుంది.


గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఖుషి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నానని... అప్పటి వరకే ఎన్నో వేల రూపాయలను అయ్యాయని కానీ తను చెర్రీ కి తిరిగి ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. వరసకి బాబాయి అబ్బాయి అయినప్పటికీ... అన్నదమ్ముల్లాగా తాము ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.


పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని 2007వ సంవత్సరంలో తెలియజేశాడు. రామ్ చరణ్ మొట్టమొదటిగా నటించిన చిరుత చిత్ర షూటింగు 2007లో పూర్తి కాగా... ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి అనేక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే రామ్ చరణ్ గురించి చెప్పేందుకు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో విషయాలను తెలియ పరిచారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రామ్ చరణ్ వద్ద అప్పు తీసుకున్నానని తెలియజేశాడు. ఇకపోతే రాంచరణ్ మొట్ట మొదటి సినిమా చిరుత కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా... హీరోయిన్ గా నేహా శర్మ నటించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చగా... పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: