వారిద్దరి చివరి కోరిక తీర్చిన సమంత !

Seetha Sailaja
ప్రతిరోజు తన ట్విటర్ లో ఎదో ఒక సందడి చేస్తూ హడావిడి చేసే సమంతలో ఉండే మానవీయ కోణానికి సంబంధించిన ఒక ఆశక్తికర విషయం ఈమధ్య బయట పడింది. సమంత ప్రత్యూష ఫౌండేషన్ కార్యక్రమాలకు తన వంతు సహాయం చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.  ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ కట్టిన ప్రేమ మందిరం తాజ్ మహల్ ను చూడాలని పన్నెండేళ్ల అనిల్ కు, పధ్నాలుగేళ్ళ కృష్ణవేణికి కోరిక కలిగింది. ప్రస్తుతం వారిద్దరూ ఒక భయంకరమైన వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. వీరికి ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత సహాయం చేస్తోంది. వీరిద్దరికీ వైద్య సహాయం చేయిస్తున్న సమంతకు ఈ పిల్లల తాజ్ మహల్ చూడాలనే కోరిక తెలిసింది. తెలియడంతోనే సమంత ఈ కోరిక తీర్చే ప్రోగ్రామ్‌కి ‘విష్ కమ్ ట్రూ’ అనే పేరు పెట్టింది సమంత. ఈ చిన్నారులిద్దరినీ తొలిసారి విమానయానం చేయించడంతో పాటు కళ్లు చెదిరే అందంతో మెరిసిన ఆ తాజ్‌ మహల్‌ని ఆగ్రాలోని అత్యంత ఖరీదైన 7 నక్షత్రాల హోటల్ ను చూపించి ఈ చిన్నారుల కోరిక తీర్చింది సమంత.  దీనితో సంబరపడిపోయిన ఆ చిన్నారులు ‘థ్యాంక్యూ సమంతక్కా, వి లవ్ యు’ అంటు సమంతను చూడాలనుకుంటున్నారట. మరి ఆ చిన్నారుల కోరిక ఎప్పుడు తీరుస్తుందో చూడాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎవరైనా సమంత బాహ్య సౌందర్యమే కాదు ఆత్మ సౌందర్యాన్ని కూడా మెచ్చుకోకుండా ఉండలేరు దటీజ్ సమంత.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: