పూజ, రష్మికను పక్కకు తోసే ఆలోచనలో టాలీవుడ్..!

VUYYURU SUBHASH

టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న దర్శకుడు అయిన పెద్ద దర్శకుడు అయినా సరే హీరోయిన్ ల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. గతంలో హీరో ఆధారంగా సినిమాలు ఉండేవి. కాని ఇప్పుడు హీరోయిన్ నటన కు కూడా సినిమాలో ప్రాధాన్యత ఎక్కువగానే ఇస్తున్నారు అనేది వాస్తవం. ఈ నేపధ్యంలో ఇప్పుడు దర్శక నిర్మాతలు అందరూ నటన పరంగా బాగా రాణించే వారి మీదనే దృష్టి పెట్టారు. అయితే న‌టనా ప‌రంగా రాణించే హీరోయిన్లు ఎవ‌రు ఉన్నార‌న్న ప్ర‌శ్న వేసుకుంటూ షాక్ అవ్వాల్సిందే.

 

మ‌న‌కు ఉన్న హీరోయిన్ల‌లో ఎక్కువ కాలం కెరీయ‌ర్ కొన‌సాగించిన వాళ్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు ఎవ‌రో అనుష్క లేదా న‌య‌న‌తార లాంటి వాళ్లు మాత్ర‌మే న‌ట‌నా ప‌రంగా పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న రోల్స్ ఎంచుకుని సుదీర్ఘ కాలంగా కెరీయ‌ర్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. మిగిలిన వాళ్లు గ్లామ‌ర్ ప‌రంగానో లేదా స్కిన్ షో నో న‌మ్ముకుని సినిమాలు చేస్తూ కెరియ‌ర్ నెట్ట‌కు వ‌స్తున్న వాళ్లే.

 

ఇప్పుడు ఇదే మన తెలుగులో కొందరు హీరోయిన్ లకు బాగా ఇబ్బంది గా మారింది. గ్లామర్ తోనో లేక అవకాశాల తోనో ఇప్పుడు లక్కీ హీరోయిన్ లు గా మారిన రష్మిక మందన, పూజ హెగ్డే ఇద్దరూ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ లు. ఇప్పుడు ఈ ఇద్దరినీ పక్కన పెట్టే ఆలోచనలో ఉన్న దర్శకులు ఒక కారణం వెతుక్కున్నారు. వాళ్లకు ఒక్క డాన్స్ మినహా నటన రాదని అంటున్నారు.

 

కనీసం సీరియస్ సన్నివేశాల్లో కూడా ఏ విధంగా వ్యవహరించాలి అనేది కూడా ఇద్దరికీ కనీస అవగాహన లేదని, వారి వలన ఎలాంటి ఉపయోగం కూడా ఇప్పుడు తమకు కనపడటం లేదని భావిస్తూ వారి స్థానంలో నటన ఉండి మంచి హావ భావాలు ఉండే హీరొయిన్ లను తీసుకుంటే సినిమాకు మంచి పేరు వస్తుంది అని భావిస్తున్నారు. అవసరం అయితే సీనియర్ హీరోయిన్ లు అయినా సరే పర్వాలేదు అని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: