చిరు వీడియో పై సంచలన కామెంట్స్ చేసిన...హీరో నాని !!
మెగా స్టార్ చిరంజీవి గారు ఖైదీ 150 చిత్రం లో తన నటనతో మరో మారు నిరూపించుకున్నాడు మెగా స్టార్ ని అని. ఆ చిత్రంలో అయన వేసే స్టెప్స్ ఇప్పటి కుర్రకారుకు సైతం ఈర్ష పుట్టించేలాగ ఉంటాయి. అసలు విషయం ఏమిటంటే ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఎవరు రారు పోటీ. మెగాస్టార్ చిరంజీవి గారు లాక్ డౌన్ అయిన తరువాత సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇంటిపనులు, వంటింటి పనులు ఇలా అన్నిరకాలుగా తన వీడియోస్ తో మెగాస్టార్ చిరు యాక్టీవ్ గానే ఉంటున్నారు.
అయితే లేటెస్ట్ గా తన ట్విట్టర్ ఖాతాలో తన మనమరాలు ఖైదీ 150 మూవీ నుండి ' మిమ్మి ..మ్మిమ్మి ..ఇకపై ఓన్లీ యు అండ్ మీ ' అనే పాటను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నట్లు మరియు హావభావాలను చూపిస్తున్న వీడియోను చిరంజీవి గారు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు అయితే తాత మరియు మనవరాలి గొలను అంతా చిరంజీవి భార్య సురేఖ తన మొబైల్ లో షూట్ చేసింది. ఆ వీడియోను చిరంజీవి గారు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ " పాట నాది కాబట్టి ..అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ అంతా నాకే " అని పోస్ట్ చేసారు. తాజాగా చిరు వీడియోపై స్పందించిన నాని.. నేను ఈ వీడియోలో ఇద్దరు కిడ్స్‌ని చూస్తున్నాను. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు చిరు సర్ అని కామెంట్ పెట్టాడు. అలానే మెగాస్టార్‌కి ట్విట్టర్లోకి వెల్కమ్ చెప్పారు నాని.
I see two little kids .. which one are you talking about Sir ?
Welcome to twitter megastar @KChiruTweets ❤️ https://t.co/BaL07jRPxx — nani (@NameisNani) April 28, 2020