ఆ పని చేసి ఫ్యాన్ కోరిక తీర్చిన అనసూయ...?

praveen

బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ వున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసినప్పుడు నుంచి అనసూయ కెరీర్ మొత్తం మారిపోయింది అని చెప్పాలి. జబర్దస్త్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అనసూయ. బుల్లితెర యాంకర్ లలో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో దూసుకుపోతూ ఎంతగానో అభిమానులను సంపాదించుకుంది. కేవలం బుల్లితెరలో పలు షోలతో  అభిమానులను  సాధించడమే కాదు... అటూ  సోషల్ మీడియా వేదికగా కూడా తన హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడు అభిమానులకు చెమటలు పట్టిస్తుంది అన్న విషయం తెలిసిందే. అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. 

 

 ఇక సామాజిక సమస్యలపై స్పందించడమే కాకుండా ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్  చాట్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో  అనసూయ హవా నడుస్తుంది అని చెప్పాలి.  ఓ వైపు వరుస ప్రోగ్రాంలో చేసుకుంటూ దూసుకుపోతున్న అనసూయ... మరోవైపు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుని ఎంతగానో గుర్తింపు సంపాదిస్తోంది. అనసూయ తన వాక్చాతుర్యంతో ఎంతోమంది ఆకర్షించడంతో పాటు తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోగల గొప్ప నటి అనసూయ . 

 

 కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ లోని కొత్త టాలెంట్ బయటపడింది. తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన ఈ అమ్మడు .. ఓ అభిమాని కోరిన కోరిక తీర్చింది. ఆన్లైన్ లైవ్ చాట్ చేస్తున్న సమయంలో అభిమాని అనసూయను ఒక సాంగ్ పడాల్సింది గా కోరాడు. దీంతో వెంటనే ఆలోచించకుండా.. ఒక మంచి సాంగ్ పాడింది అనసూయ. నీతో చెప్పనా అంటూ సాంగ్ పాడి  అభిమాని కోరిక తీర్చింది అనసూయ. ఇక ఆన్లైన్ చాటింగ్ లో అనసూయ పాడిన పాటకి నెటిజన్లు అందరూ ఫిదా అయ్యారు అని చెప్పాలి.
 ఏదేమైనా అనసూయలో సింగింగ్ టాలెంట్ కూడా ఉందని నెటిజన్లకు తెలిసింది.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/nojoGRAMRtU" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: