పూరి జగన్నాథ్ టాలీవుడ్ @20 సంవత్సరాలు ...!
మన తెలుగు ఇండస్ట్రీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫుల్ గా తన 20 సంవత్సరాల దర్శకత్వ జీవితాన్ని కొనసాగించాడు. పూరి దర్శకత్వం లో మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తో బద్రి అనే సినిమా తీశారు. బద్రి సినిమాకి కూడా సరిగ్గా ఈ రోజుకి 20 ఏళ్లు అయిందట. ఈరోజు ఏప్రిల్ 20 పూరి జగన్నాథ్ కెరియర్లోనే స్ట్రాంగ్ పునాది వేసిందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో అభిమానులకు కొత్తగా పరిచయం చేయడం జరిగింది. ఇక దీనితో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు పూరి జగన్నాథ్.
Yessssssssssss Harish . Kummeddam Lov youuuuu😘🙏🏽 https://t.co/WpkiF5mzaa — PURIJAGAN (@purijagan) April 20, 2020
అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ జోస్ కొనసాగుతున్నడు పూరి జగన్నాథ్. మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు పూరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్, రామ్ స్టార్ హీరోలందరితో పూరి జగన్నాథ్ సినిమాలు మంచి హిట్ సొంతం చేసుకున్నాడు పూరి జగన్నాథ్. తన కెరీర్లో చాలా సూపర్ డూపర్ హిట్స్ దక్కిన కూడా ఆయన దర్శకుడిగానే తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని చెప్పాలి. ఇక చార్మితో కలిసి తన సినిమాలను తానే నిర్మించుకుంటున్నారు పూరి జగన్నాథ్. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ కాంబినేషన్లో విడుదలయిన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఈ విషయాన్ని మరో డైరెక్టర్ హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా గురూజీ ఇంకో 20 సంవత్సరాలు ఇలాగే మీరు చేయాలి అంటూ మీరు నాకు ఇన్స్పిరేషన్ అంటూ పూరి జగన్నాథ్ కి విషెస్ తెలిపాడు. దీనికి బదులుగా పూరి జగన్నాథ్ ఎస్ ఆర్ ఎస్ కుమ్మేద్దాం లవ్ యు అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిప్లై ఇచ్చాడు పూరి.