బ్లాక్ డ్రెస్ లో జాన్వీ కపూర్ : బ్రహ్మాండం కదా
భారతీయ సినీ జగత్తులో తనకంటూ సువర్ణాక్షరాలు లిఖించి అందాల భామ అతిలోక సుందరి శ్రీదేవి ఆ మద్య దుబాయ్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. బాలనటిగా ప్రస్థానం మొదలు పెట్టి మూడు తరాల నటులతో హీరోయిన్ గా నటించిన మెప్పించింది. ఏ ఇండస్ట్రీలో అయినా సరే తానే నెంబర్ వన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో మంచి ఫామ్ లో ఉండగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ కపూర్ లు జన్మించారు. తన పెద్ద కూతురు జాన్వీని హీరోయిన్ గా చూడాలన్న కోరిక తీరకుండానే శ్రీదేవి కన్నమూశారు.
జాన్వీ తొలి చిత్రం ధడక్ రిలీజై నాటికి శ్రీదేవి లేకపోవడం బాదాకరం. షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ తో కలిసి నటించింది. ఒక్క చిత్రంతోనే శ్రీదేవి కూతురు గా తన సత్తా చాటింది జాన్వీ కపూర్. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ అమ్మడి పేరు మారుమోగుతుంది. దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటిస్తున్న జాన్వీ వరుసగా కార్గిల్ గాళ్.. రూహి అఫ్జా (హారర్ కామెడీ) చిత్రాల్లో నటిస్తోంది.
అలాగే కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటించనుంది. రుహి అఫ్జా చిత్రంలో జాన్వీ సరసన రాజ్ కుమార్ రావ్ నటించనున్నారు. ఆగ్రా.. మనాలీ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. హార్ధిక్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 2020లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.