మెగాస్టార్ చిరంజీవి క్యూట్ ఎమోషన్..!!

Kavya Nekkanti

మెగాస్టార్ చిరంజీవి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈయ‌న ఎన్నో రికార్డులు సృష్టించారు. తెలుగు సినిమా హీరోల్లో ఇంతలా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో ఆయన. పునాదిరాళ్లు సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌తో బాక్సాఫిస్ వ‌ద్ద భూకంపాన్ని సృష్టించారు. ఇక ఇప్ప‌టికీ ఈయ‌న సినీ ప్ర‌స్థానం దిగ్విజ‌యంగా సాగుతూనే ఉంది. అయితే తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు ఇటీవ‌ల చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చిరు ఎన్నో పోస్టులు పెడుతూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు.

ఇటీవ‌ల మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే చెర్రీ త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా చిరు ఓ ఫోటో పోస్ట్ చేశారు.  తన కుమారుడి పుట్టినరోజు తనకు ఎంత ప్రత్యేకమో ఆ పోస్ట్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. చరణ్ పుట్టిన రోజు ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం’. ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ చిరు పోస్ట్‌ను రాసుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ``చరణ్ పుట్టినప్పుడు నేను సహజంగానే చాలా సంతోషించాను. దానికి గల కారణం ఏంటో తరవాత తెలిసింది. చరణ్ పుట్టింది మార్చి 27న. ఆ రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం. 

నీటిలోకి చేప వెళ్లినట్టుగా చరణ్ నటనలోకి అడుగుపెట్టాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సంతోష క్షణాలు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి పోప్ట్ చేశాడు. అయితే చిరు ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేసిన ఫోటోనే చాలా హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫోటోలో రామ్‌చ‌ర‌ణ్‌ను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని ఆప్యాయంగా ముద్దాడుతున్నారు చిరంజీవి. బహుశా అప్పుడు చరణ్ వయసు నెలల్లోనే ఉంటుంది. ఈ ఫోటో చూస్తే ఎందో క్యూట్ & ఎమోష‌న్‌ల్‌గా ఉంటుంది. ఏదేమైనా చిరు కాస్త ఆల‌స్యంగా సోస‌ల్ మీడియాలోకి అడుగుపెట్టినా.. మంచి సందేశాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I was naturally overjoyed when Charan was born. ‪It was only much later that it occurred to me there was perhaps a reason why he was born on the #WorldTheatreDay 27th March - ‘Prapancha ‘Rangasthala’ dinotsavam’ ! He took to acting like a fish to water. On the eve of @alwaysramcharan 's birthday, Many Many Happy Returns #Charan ! ‬ ‪#ThrowbackPic

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: