రామాయణంలో సీతాగా మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ.. ఎప్పుడో తెలుసా?

Edari Rama Krishna

బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రౌనత్.  ఆమె నటించిన చిత్రాల కన్నా సోషల్ మీడియాలో ఆమె కాంట్రవర్సీలే ఎక్కువగా ఉన్నాయి.  ఏ విషయం అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడుతూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది కంగనా. మీ టూ ఉద్యమంలో ఈ అమ్మడి పేరు ఓ రేంజ్ లో వినిపించింది.  ఆ మద్య మణికర్ణిక మూవీ మేకింగ్ విషయంలో కూడా కంగనా ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంది.  ఇక ఓకప్పుడు టెలివిజన్ రంగంలో ఎన్నో సంచనలాలు సృష్టించిన రామాయణం ఇప్పుడు మళ్లీ దూరదర్శన్ లో వస్తుంది. 

 

లాక్‌డౌన్ పిరియడ్‌లో రామాయణం సీరియల్‌పై చర్చ జరుగుతుండగా బాలీవుడ్ నటి కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రామాయణంలో సీతగా కంగన నటించిందనే విషయాన్ని చెప్పి అభిమానులు ఆశ్చర్యానికి గురిచేశారు. రామాయణంలో కంగనా సీతగా నటించడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే కంగారు పడకండి. తాను 13 ఏళ్ల వయసులో ఉండగా.. రామాయణం అనే నాటికకు స్కూల్ వేశారు అనే విషయాన్ని రంగోలి చెప్పారు. 

 

అందులో సీతగా స్వయంగా కంగన అద్భుతమైన నారీ పాత్రను పోషించారని చెప్పింది. రామాయణం నాటకం వేయొద్దని తమ తండ్రి ఎంత వారించినా.. తాను మాత్రం సీత పాత్రలో నటించింది. ఆ విషయంలో నాన్న చెల్లిని ఎంతో తిట్టారని అన్నారు.  ఆ వయసులోనే క్యాస్టూమ్ డిజైనర్‌గా మేకప్ ఆర్టిస్టుగా పనిచేసి తన ప్రతిభను చాటుకొన్నారు అని చెప్పారు. దానికి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసింది రంగోలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: