చిరంజీవికి శ్రీదేవి పెట్టిన కండిషన్స్ ను బయటపెట్టిన పరుచూరి !

Seetha Sailaja


200 సినిమాలకు పైగా రచయితగా ĝపనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ  ఈమధ్య సినిమాలకు సంబంధించి కధలు వ్రాసే విషయంలో కొత్తతరం రచయితలతో పోటీపడలేక పోవడంతో పరుచూరి హవా ఇప్పుడు బాగా తగ్గింది. ప్రస్తుతం బాగా పేరు ఉన్న ప్రతి సెలిబ్రిటీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సందడి చేస్తున్నట్లుగా పరుచూరి గోపాలకృష్ణ కూడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆనాటి సినిమాల గురించి అప్పటితరం హీరో హీరోయిన్స్ ఇగోల గురించి అనేక ఆసక్తికర విషయాలు నేటితరానికి తన యూట్యూబ్ ఛానల్ ద్వరా తెలియచేస్తున్నాడు. 

లేటెస్ట్ గా పరుచూరి చిరంజీవి సినిమాలలో ఒకనాటి సూపర్ హిట్ మూవీ ‘కొండవీటి దొంగ’ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. 1990 లో విడుదలైన ఈసినిమాలో విజయశాంతి రాధ హీరోయిన్స్ గా నటిస్తే శారద శ్రీవిద్య లాంటి వెటరన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహిస్తే పరుచూరి బ్రదర్స్ మాటలు కథ అందించారు. 

 

ఈ మూవీ విడుదలై 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పరుచూరి బయటపెట్టారు. వాస్తవానికి ఈ సినిమాలో శ్రీదేవిని మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేయాలని ప్రయత్నించారట. అప్పటికే శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ గా మారిపోవడంతో ఆమె ఈ మూవీ కథ విని ఈ సినిమాలో తాను నటించాలి అంటే ఈ మూవీ టైటిల్ ను ‘కొండవీటి దొంగ’ అని కాకుండా ‘కొండవీటి రాణి కొండవీటి దొంగ’ అని మార్చమని అని సూచించిందట. 


ఈ విషయాలు అప్పట్లో చిరంజీవి వరకు వెళ్ళడంతో చిరంజీవి శ్రీదేవి సూచనకు షాక్ అయినట్లు అప్పటి విషయాలను ఇప్పుడు పరుచూరి గుర్తుకు చేసుకున్నాడు. దీనితో శ్రీదేవి స్థానంలో ఇతర హీరోయిన్స్ ఎంపిక అయిన విషయాన్ని పరుచూరి బయటపెట్టాడు. శ్రీదేవికి మాత్రమే కాదు ఆమె చనిపోయి ప్రస్తుతం ఆమె వారసురాలుగా జాహ్నవి సినిమాలలో నటిస్తూ తెలుగు సినిమాలు అన్నా ఇక్కడి యంగ్ హీరోలు అన్నా జాహ్నవికి కూడ పెద్దగా ఆసక్తి లేదు అన్నవిషయం అందరికీ తెలిసిందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: