కరోనా వైరస్ : ఎన్టీఆర్, చరణ్ చెప్పిన ముఖ్యమైన జాగ్రత్తలు..!

shami

కరోనా వైరస్ వల్ల దేశం అంతటా చాలా అలర్ట్ గా ఉంది. రాష్ట్రాలన్ని ఈ వైరస్ ఎక్కువ సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యానంగా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణా ఆంధ్ర ప్రభుత్వాలు కరోనా గురించి జాగ్రత్తగా ఉండాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, స్పోర్ట్స్ అన్నిటిని స్టాప్ చేశారు.

 

ఇక ఈ వైరస్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏది నిజం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్న కకన్ ఫ్యూజన్ ప్రజల్లో ఉంది. అందుకే ఆర్.ఆర్.ఆర్ హీరోస్ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కలిసి కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటె తక్షణమే హాస్పిటల్ కు వెళ్లాలని అన్నారు. సాధ్యమైనంత వరకు జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు తిరకాకుండా ఉంటే మంచిదని చెప్పారు. మీకు జలుబు, దగ్గు లాంటి సింటమ్స్ ఉంటేనే మాస్క్ ధరించాలని అది లేకుండా ధరిస్తే కూడా వైరస్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హ్యాన్డ్ వాష్ కూడా మోచేతుల వరకు కడగాలి.. గోళ్లలో కూడా వాష్ కరెక్ట్ గా చేసుకోవాలని అన్నారు. 

 

అంతేకాదు తుమ్ము, దగ్గు వస్తే చేతులు అడ్డు పెట్టుకోకుండా.. మోచేయిని అడ్డుగా పెట్టుకోవాలని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన సూచనలను చదివి అర్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కలిసి కరోనా గురించి ఇలా జాగ్రత్తలు చెప్పడం అందరిని ఆకట్టుకుంది. కరోనా భారిన పడకుండా ఉండాలంటే మాత్రం ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే. 

 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/ICVYlNmb6NY" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: